Mental Stress: ఈ లక్షణాలు ఉన్నాయా.. మీలో మానసిక ఒత్తిడి ఉన్నట్లే..

|

Dec 25, 2024 | 3:05 PM

సాధారణంగా జీవితంలో ఎప్పుడో ఒకసారి అయినా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి స్ట్రెస్ మీలో ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలీదు. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా సమస్య ఉన్నట్లే. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం లేట్ చేయకుండా చికిత్స తీసుకోండి..

1 / 5
ప్రస్తుత కాలంలో ఒత్తిడి, ఆందోళన అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కొంత మందికి తమలో స్ట్రెస్ ఉందన్న సంగతి కూడా తెలీదు. ఈ లక్షణాలు మీలో ఉన్నట్లయితే.. మీరు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారని అర్థం చేసుకోవాలి.

2 / 5
సాధారణంగా ఉండే నొప్పుల కంటే కండరాల నొప్పులు, ఒంటి నొప్పులు, మైగ్రేన్, తలనొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం ఇవి స్ట్రెస్‌కి ప్రాథమిక లక్షణాలుగా చెప్పొచ్చు.

సాధారణంగా ఉండే నొప్పుల కంటే కండరాల నొప్పులు, ఒంటి నొప్పులు, మైగ్రేన్, తలనొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి ఎక్కువగా ఉంటే మాత్రం ఇవి స్ట్రెస్‌కి ప్రాథమిక లక్షణాలుగా చెప్పొచ్చు.

3 / 5
మీలో ఏ పని చేయాలన్నా, తినాలన్నా, బయట తిరగాలన్నా  ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. నలుగురితో మాట్లాడేందుకు కూడా ఇష్ట పడరు. ఒంటరిగా ఉండాలనిపిస్తూ ఉంటుంది. పనులపై కూడా శ్రద్ధ తగ్గుతుంది. ఏ పని చేయడానికి కూడా ఆసక్తి చూపించరు.

4 / 5
ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. పరధ్యానంలో ఉంటారు. ఏదో తెలియని ఆందోళన వెంటాడుతూ ఉంటారు. తరచూ ఛాతీలో నొప్పి, దడగా ఉండటం, చిన్న వాటికే టెన్షన్ పడుతూ ఉండటం కూడా స్ట్రెస్‌కు కారణమే. కోపం ఎక్కువగా వస్తుంది.

5 / 5
సాధారణంగా ఉండే ఆహారాలపై ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువగా అలసటగా, నీరసంగా ఉంటారు. ఎక్కువగా జంక్ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించినా మీరు లైట్ తీసుకోకుండా వెంటేనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

సాధారణంగా ఉండే ఆహారాలపై ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కువగా అలసటగా, నీరసంగా ఉంటారు. ఎక్కువగా జంక్ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించినా మీరు లైట్ తీసుకోకుండా వెంటేనే వైద్యుల్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)