Health Tips: ఓర్నాయనో.. ఆకలి వేయడం లేదా..? ఆ ప్రమాదకర వ్యాధికి సంకేతం కావచ్చు..

Updated on: Aug 16, 2025 | 11:39 AM

ఆకలి లేకపోవడం అనేది ఒక చిన్న సమస్యగా కనిపించవచ్చు. కానీ కొన్నిసార్లు ఇది శరీరంలో జరుగుతున్న తీవ్రమైన సమస్యలకు మొదటి సంకేతం కావచ్చు. చాలా మంది దీనిని అలసట, వాతావరణంలో మార్పు లేదా ఒత్తిడి కారణంగా పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే దానిని లైట్ తీసుకోవద్దు. ఆకలి తగ్గడానికి గల కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
జీర్ణక్రియ సమస్యలు: ఆకలి లేకపోవడానికి ప్రధాన కారణాలలో జీర్ణక్రియ సంబంధిత వ్యాధులు ఒకటి. గ్యాస్ట్రైటిస్, అల్సర్, లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉంటే కడుపులో బరువుగా అనిపించడం, కొద్దిగా తిన్నా వెంటనే కడుపు నిండినట్లు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల ఆకలి తగ్గుతుంది.

2 / 5
మానసిక ఒత్తిడి: డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఆకలిని ప్రభావితం చేస్తాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆహారం తినాలని అనిపించకపోవచ్చు. దీనివల్ల బరువు తగ్గడం, బలహీనత వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.

3 / 5
ఇతర వ్యాధులు: కొన్ని తీవ్రమైన వ్యాధులకు కూడా ఆకలి లేకపోవడం ఒక ముఖ్య లక్షణం. మధుమేహం, కిడ్నీ వ్యాధులు, గుండె సమస్యలు లేదా కొన్ని రకాల క్యాన్సర్‌లలో కూడా ఆకలి తగ్గిపోతుంది. అలాగే, టీబీ, వైరల్ హెపటైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు కూడా శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడుతూ శక్తిని కోల్పోతుంది. దీనివల్ల ఆకలి తగ్గుతుంది.

4 / 5
 థైరాయిడ్ సమస్యలు: థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు తగ్గినా (హైపోథైరాయిడిజం) జీవక్రియ మందగించి ఆకలి తగ్గుతుంది. కొన్ని రోజులు ఆకలి లేకపోవడం సాధారణం. కానీ ఈ పరిస్థితి రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆకలి లేకపోవడంతో పాటు అలసట, బరువు తగ్గడం, బలహీనత, లేదా కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే అది ఏదైనా పెద్ద వ్యాధికి సంకేతం కావచ్చు.

5 / 5
పరిష్కార మార్గాలు: రోజులో ఒకేసారి ఎక్కువ తినకుం.. కొద్దికొద్దిగా ఎక్కువ సార్లు తినాలి. అధిక ప్రోటీన్, ఫైబర్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా నీరు తాగాలి. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. తేలికపాటి నడక, యోగా, లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.