- Telugu News Photo Gallery Don't eat these five things by mistake after consuming mango in summer, it will cause health defects in Telugu
Summer Tips: మామిడి పండ్లు తిన్న తర్వాత వీటిని అసలు తీసుకోకూడదు.. ఎందుకో తెలుసా?
Summer Health Tips: వేసవి కాలంలో విరివిగా లభించే మామిడి పండును అందరూ ఇష్టపడి తింటుంటారు. అయితే మామిడి పండ్లను తిన్న తర్వాత కూడా గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి
Updated on: Apr 09, 2022 | 6:45 AM

కాకర కాయలు: మామిడి పండు తిన్న వెంటనే కరెలాతో చేసిన పదార్థాలు తింటే కడుపులో మంట వస్తుందంటారు. అలాగే వికారం లేదా వాంతులు వంటివి రావొచ్చు.

కూల్‌డ్రింక్స్: మామిడికాయలు తిన్న తర్వాత శీతల పానీయాలు అస్సలు తాగకూడదు. వీటిని ఒకేసారి తీసుకోవడం వల్ల మామిడిపండ్లలోని చక్కెర, శీతల పానీయాల్లోని చక్కెర శరీరంలో రక్తంలో చక్కెర స్థాయులను పెంచతుతాయి

నీరు: మామిడి పండు తిన్న వెంటనే నీరు త్రాగాలని పిల్లలు పట్టుబడుతుంటారు. అయితే మామిడి పండ్లు తిన్న తర్వాత నీళ్లు తాగడం ఆరోగ్యానికి హానికరం. వాంతులు లేదా వికారాలు తలెత్తే ప్రమాదం ఉంది.

మసాలా పదార్థాలు: మామిడి పండ్లను తిన్న వెంటనే స్పైసీ ఫుడ్స్ తినకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది కడుపులో గ్యాస్ లేదా అసిడిటీకి కారణం కావచ్చు. అదేవిధంగా చర్మంపై దురుద, మంటను కూడా కలిగిస్తాయి.

పెరుగు: మామిడి పండ్లు తిన్న తర్వాత పెరుగు తీసుకోవడం వల్ల అలెర్జీలు, జలుబు వంటి సమస్యలు తలెత్తవచ్చు.

మామిడి పండు తిన్న తర్వాత ఈ ఆహార పదార్థాలను అసలు తీసుకోకూడదు గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని టీవీ 9 తెలుగు ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్రువీకరించదు. అందుకే ఏదైనా తీసుకునేముందు నిపుణులు, డాక్టర్ల సలహాలు తీసుకోవడం మంచిది.




