నేటి జీవనశైలిలో అందరూ ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే, ఒక్కోసారి ఒత్తిడిగా ఉంటుంది. అలాంటి సమయంలో నవ్వు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఎందుకంటే, ఇది మనల్ని ఎన్నో సమస్యల నుంచి కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు.

నవ్వు ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అలాగే, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. కాబట్టి, ప్రతిరోజూ నవ్వండి. దీని వలన మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

రోగనిరోధక శక్తి : నిపుణుల చెప్పిన దాని ప్రకారం, నవ్వు కార్టిసాల్ అనే హార్మోన్లను తగ్గేలా చేస్తుంది. ఇది ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. నీరసంగా ఉండే వాళ్ళు రోజూ కొంత సేపు నవ్వితే మీ రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా వ్యాధుల నుంచి కాపాడుతుంది.

ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి: నవ్వడం వల్ల ఊపిరితిత్తులు పనితీరు మెరుగుపడుతుంది. దీని వల్ల ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఇక ఇప్పుడు శ్వాస తీసుకోవడం ఈజీ అవుతుంది.