ప్రొటీన్లు ఎక్కువ మొత్తంలో శరీరానికి అందితే కిడ్నీ సంబంధిత వ్యాధులు (kidney damage)చుట్టుముడతాయనే విషయం తెలుసా! అందువల్లనే కిడ్నీ రోగులు బీన్స్ వంటి ఇతర పదార్థాలు తీసుకోవడం తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ప్రోటీన్ షేక్ (protein shake)కిడ్నీ రోగులకు చాలా ప్రమాదం.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లివర్ (కాలేయం) ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ ప్రోటీన్ షేక్ తాగడం మంచిది. మోతాదుకు మించిన తాగితే కాలేయం వాపుకు గురికావడంతో పాటు పలు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రోటీన్ షేక్స్‌లో కార్బోహైడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రకమైన డ్రింక్స్ ఎక్కువగా తాగితే.. డీహైడ్రేషన్ సమస్యకు గురికావచ్చు. అందువల్ల శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి నీరు అధికంగా తాగాలి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రోటీన్ షేక్స్ అధికంగా తాగడం వల్ల బీపీ కూడా గణనీయంగా తగ్గిపోతుంది. ఈ డ్రింక్ తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ పడిపోతుందనేది ఎక్కువ మంది చెబుతున్నారు. కాబట్టి రక్తపోటుతో బాధపడేవారు ప్రోటీన్ షేక్ తాగకపోవడం మంచిది.
ఈ డ్రింక్స్‌లలో ఉండే ప్రొటీన్ల వల్ల హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఐతే తక్కువ మోతాదులో ప్రొటీన్ షేక్స్ తీసుకుంటే చర్మానికి మేలు జరుగుతుందనేది నిపుణుల మాట.