Cardamom: మసాలా దినుసుల రారాణి యాలకులు తింటే గుండె ఆరోగ్యం పదిలమే!

Updated on: Jan 15, 2025 | 8:47 PM

వంటకాలకు కమ్మటి సువాసనతోపాటు ఆహారానికి మంచి రుచిని ఇచ్చే యాలకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే వీటిని ఎల్లప్పుడూ పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. ముఖ్యంగా యాలకులు తీసుకోవడం వల్ల గుండెతోపాటు శరీరంలో వివిధ సమస్యలు ఇట్టే మాయమవుతాయి..

1 / 5
cardamom

cardamom

2 / 5
యాలకులు అల్లం కుటుంబానికి చెందిన ఎలిటేరియా, అమోమమ్ మొక్కల విత్తనాల నుంచి లభిస్తుంది. ఇందులోని మరో ప్రత్యేకత ఏంటంటే.. దీన్ని తీపి వంటకాల్లోనే కాకుండా రుచి కోసం పలు కూరల్లోనూ ఉపయోగిస్తారు. టీ, కాఫీ వంటి పానీయాలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తుంటాం. ఇందులో అనేక ఔషధ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది జీర్ణక్రియ నుంచి శ్వాసను ఫ్రెష్ చేయడం వరకు అన్నింటికీ సహజమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది.

3 / 5
యాలకులతో జీర్ణ వ్యవస్థకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపిస్తే రెండు యాలకులు నోట్లో వేసుకుని నమిలితే చాలు.. సత్వర ఉపశమనం లభిస్తుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు యాలకులు తింటే గ్యాస్‌, ఎసిడిటీ, మలబద్ధకం వంటి పొట్ట సమస్యలు తగ్గిపోతాయిని నిపుణులు చెబుతున్నారు.

4 / 5
యాలకులలో ఉండే డైయూరెటిక్‌ గుణాలు ఉంటాయి. దీంతో శరీరంలో పేరుకున్న మలినాలు బయటికి వెళ్లిపోతాయి. అలా కిడ్నీల ఆరోగ్యానికి అండగా నిలుస్తాయి. శరీరానికి ఉన్న సహజ డిటాక్స్‌ క్రమాన్ని మెరుగుపరుస్తాయి.

5 / 5
యాలకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి. మొత్తం గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

Follow Us