అప్పుడప్పుడు చేతులు వణుకుతున్నాయా? కారణాలు ఇవే!

Updated on: Sep 02, 2025 | 7:11 PM

కొన్ని సార్లు ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా చేతులు వణుకుతుంటాయి. అయితే ఇలా అసంకల్పితంగా చేతులు వణడం అనేది సాధరణ సమస్య అయినప్పటికీ నిరంతరం లేదా ఎక్కువగా చేతులు వణకడం అనేది అనారోగ్య సమస్యలకు కారణం కావచ్చు అంటున్నారు. ముఖ్యంగా పోషకాహార లోపం దీనికి అసలైన కారణం, వస్తువులు పట్టుకోలేకపోవడం , ఏదైనా బరువు వస్తువులు పట్టుకున్నప్పుడు చేతులు వణకడం అనేది కొన్ని విటమిన్స్ లోపం వలన వస్తుందంట.

1 / 5
 నాడీ వ్యవస్థపనితీరు సక్రమంగా పని చేయని సమయంలో చేతిలో వణుకు పుడుతుందంట. అయితే నాడీ వ్యవస్థ పనితీరును కాపాడుకోవడంలో విటమిన్స్ కీలక పాత్రపోషిస్తాయి. నిర్దిష్టమైన విటమిన్స్ లోపం నరాల పనితీరును దెబ్బతీస్తాయి. దీని వలన చేతిలో వణుకు, నాడీ సంబంధిత రుగ్మతలు కనిపిస్తాయి. కాగా మనం నాడీ వ్యవస్థను దెబ్బతీసే విటమిన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

2 / 5
విటమిన్ బీ 12 : శరీరానికి విటమిన్ బీ 12 చాలా అవసరం. ఇది శరీరానికి కావాల్సినంత ఉంటే నాడీ వ్యవస్థ పనితీరు బాగుంటుంది. కానీ దీని లోపం ఉంటే అనేక సమస్యలకు కారణం అవుతుంది. ఎందుకంటే? విటమిన్ బీ 12 ఎర్రరక్త కణాల ఉత్పత్తికి చాలా అవరసం. అలాంటి ఈ విటమిన్ లోపిస్తే, చేతిలో వణుకు వంటి సమస్యలు తలెత్తుతాయి. నాడీ పనితీరు కూడా దెబ్బతింటుంది.

3 / 5
విటమిన్ డి : విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది.  ఇది నరాల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అయితే విటమిన్ డి లోపం ఉన్నవారిలో చేతిలో వణుకు, నాడీ సంబంధిత సమస్యలు, పార్కిన్సన్స్ వ్యాధి వంటి సమస్యలు తలెత్తుతాయంట.

4 / 5
మెగ్నీషియం  : మెగ్నీషియం నరాల పనితీరు, కండరాల ఆరోగ్యం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక వేళ శరీరంలో మెగ్నీషియం లోపిస్తే మాత్రం కండరాల నొప్పులు, చేతులు వణకడం వంటి సమస్యలకు కారణం అవుతుందంట. అంతే కాకుండా నరాల పనితీరులో ఇది ముఖ్యమైనది. మెదడులోని న్యూరో ట్రాన్మ్సిటర్ సంకేతాలను నియంత్రిస్తుందంట.

5 / 5
అందుకే ఈ విటమిన్స్ లోపం వలన తరుచూ చేతులు వణకడం వంటి సమస్యలు తలెత్తుతాయంట. అందుకే తప్పనిసరిగా, ఈ విటమిన్ లోపం లేకుండా చూసుకోవాలంట. అలాగే నాడీ వ్యవస్థ పనితీరు బాగుండటానికి మంచి ఆహారపదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.