Health Tips: ఉదయం టిఫిన్ తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? పెద్ద కథే ఉందిగా..

Updated on: Aug 07, 2025 | 9:30 PM

చాలా మంది టిఫిన్ స్కిప్ చేసి మధ్యాహ్నం నేరుగా భోజనం చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యానికి హానికరం. అల్పాహారం మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో, టిఫిన్‌లో ఏవి చేర్చుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

1 / 5
మన శరీరం ముఖ్యంగా ఉదయం తినే టిఫిన్ నుంచి ఎక్కువ శక్తిని పొందుతుంది. ఉదయం పోషకమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని అంటారు. ఇది శరీరానికి రోజంతా శక్తిని ఇస్తుంది. ఇది మన మొత్తం ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ నేటి బిజీ షెడ్యూల్‌లో.. చాలా మంది దీనిని విస్మరిస్తారు. ఉదయం తమ పనులన్నీ హడావిడిగా చేసిన తర్వాత వారు ఆఫీసుకు వెళ్లే క్రమంలో టిఫిన్‌ను స్కిప్ చేస్తారు.

2 / 5
అదే సమయంలో కొంతమంది బరువు తగ్గడానికి అల్పాహారం మానేస్తారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అల్పాహారం మానేస్తే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఇది రోజంతా అలసట, బలహీనతకు కారణమవుతుంది. దీని కారణంగా మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు వస్తాయి.

3 / 5
టిఫిన్ తినకపోతే వచ్చే మార్పులు : అల్పాహారం మానేసే వ్యక్తులు తమ బరువు తగ్గుతుందని, టైమ్ సేవ్ అవుతుందని అనుకుంటారు. కానీ అది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి శక్తి అందదు. దీనివల్ల శరీరంలో రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది. అలసటగా అనిపించడం, పనిపై దృష్టి పెట్టడంలో ఇబ్బంది పడటం జరుగుతుంది. దీంతో పాటు ఎక్కువసేపు ఆకలితో ఉండటం వల్ల జీవక్రియ మందగిస్తుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది.

4 / 5
టిఫిన్ లాభాలు : ఉదయం అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరానికి రోజంతా శక్తి లభిస్తుంది. జీర్ణవ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. అందువల్ల మీరు అల్పాహారాన్ని ఎప్పుడూ స్కిప్ చేయొద్దు. ఇది మీ శరీరానికి రోజంతా ఇంధనంగా పనిచేస్తుంది. సరైన అల్పాహారం తీసుకోవడం ద్వారా రోజంతా శక్తివంతంగా, ఫ్రెష్‌గా ఉంటారు. దీంతో పాటు అల్పాహారంలో పోషకాలు ఉన్న ఫుడ్ తినాలి.

5 / 5
టిఫిన్‌లో ఏం తినాలి : అల్పాహారంలో పోషకమైన, శక్తితో నిండిన ఆహారాలు గంజి, ఉడికించిన గుడ్డు, పండ్లు, గింజలు, పెరుగు, తృణధాన్యాల రోటీలు తీసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్, ఫైబర్‌ను అందిస్తుంది. మీకు అల్పాహారం తీసుకోవడానికి సమయం దొరకకపోతే స్మూతీస్, ఫ్రూట్ సలాడ్ లేదా గింజలను తినవచ్చు. ఇవి సులభంగా, త్వరగా జీర్ణమవుతాయి.