
స్వీట్‌కార్న్ అంటేనే ఫైబర్‌కు చిరునామాగా చెబుతారు. మలబద్ధకం, పైల్స్‌తో బాధపడుతున్న వారికి ఈ స్వీట్‌కార్న్ మంచి పరిష్కారం లభిస్తుంది. తియ్యటి మొక్కజొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్‌లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్, లివర్ క్యాన్సర్‌కు చెక్ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి. స్వీట్ కార్న్ తింటే ఎసిడిటీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా నయమవుతాయి.

వివిధ పోషకాలు సమృద్ధిగా ఉండే మొక్కజొన్న గుండె, కళ్ళు, చర్మానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ అందరూ మొక్కజొన్న తినకూడదు. మొక్కజొన్న చాలా మందికి హానికరం.

పాప్‌కార్న్ చాలా మందికి ఇష్టమైన ఆహారం. సినిమాకు, పార్క్.. ఇలా ఎక్కడికైనా వెళ్లినప్పుడు మొక్క జోన్నతో చేసిన పాప్ కర్న్ లేదంటే స్వీట్ కార్న్ లాంటివి తింటూ ఉంటారు. మొక్కజొన్నలో ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే మొక్క జొన్న శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మొక్కజొన్నలో కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి.

మొక్కజొన్నలో అదనపు ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల మొటిమలు, చర్మ సమస్యలు ఉన్నవారికి అదనపు ప్రోటీన్ చర్మ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.

మొక్కజొన్నలో తగినంత కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మధుమేహం ఉంటే మొక్కజొన్న తినడం అస్సలు మంచిదికాదు. మొక్కజొన్న తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే బరువు తగ్గాలని ప్రయత్నించేవారు మొక్కజొన్న తినడం మంచిదికాదు. మొక్కజొన్నలోని కార్బోహైడ్రేట్లు, చక్కెరలు శరీర బరువును సులువుగా పెంచుతుంది.