నిద్రపోవడం అంటే అందరికీ ఇష్టమే. కానీ పనులు ఉండటం వల్ల ఎవరూ సమయానికి పడుకోరు. నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి మంచిదే. అతి నిద్రతో మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవు. నిద్ర పోయేముందు తలగడ కూడా చాలా ముఖ్యం. తలగడ లేకుండా అస్సలు నిద్ర పట్టదు.
తలగడ వేసుకోవడం వల్ల మెడ నొప్పి రాదు. చాలా మంది మెడ నొప్పితో బాధ పడుతూ ఉంటారు. అలాంటి వారు దిండు లేకుండా నిద్రపోవడమే మంచిది. అదే విధంగా భుజాల నొప్పితో బాధ పడేవారు కూడా దిండు లేకుండా నిద్రపోతే బెటర్.
దిండు వేసుకోకుండా పడుకోవడం వల్ల జుట్టు, చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సాధారణంగా దిండు మీద పడుకోవడం వల్ల దిండు, చర్మం దెబ్బతింటాయి. ఇలా పడుకోవడం వల్ల పెద్దగా సమస్య ఉండదు.
తలగడ లేకుండా పడుకుంటే వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. వెన్ను నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కానీ దిండు లేకుండా పడుకోవడం వల్ల వెన్ను నొప్పి నిటారుగా ఉండి.. నొప్పి రాకుండా ఉంటుంది.
దిండు లేకుండా పడుకుంటే తల నొప్పి కూడా తగ్గుతుంది. చాలా మంది తల నొప్పితో బాధ పడుతూ ఉంటారు. ఇలాంటి వారు తలగడ లేకుండా పడుకుంటే తలనొప్పి రాకుండా ఉంటుంది. తలకు రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.