
ఘీ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే నెయ్యి కాఫీ తాగితే శరీరానికి పోషకాలు అందుతాయి. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. నెయ్యిలో ఒమెగా 3, 6, 9 లాంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందుకే కాఫీలో నెయ్యి కలుపుకొని తాగితే శరీరంలో హెల్దీ ఫ్యాట్ పెరుగుతుంది. జీవక్రియ మెరుగవుతుంది.

ఉదయాన్నే ఈ ఘీ కాఫీ తాగడం వల్ల కడుపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అసిడిటీ సమస్యలు తగ్గడంతో పాటు జీర్ణక్రియ మెరుగ్గా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది. శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. మూడ్ స్విగ్స్ లేకుండా మెరుగ్గా ఉంటుంది. నెయ్యిలో విటమిన్ ఏ,ఈ,కే లాంటి విటమిన్లు ఉంటాయి. నెయ్యి కాఫీ తాగడం వల్ల ఇవన్నీ మన శరీరానికి అందుతాయి.

అయితే ఎస్ప్రెస్సో కాఫీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎస్ప్రెస్సో కాఫీని వేడి నీటిలో కాఫీ పొడిని జోడించడం లేదా మరిగించడం ద్వారా తయారు చేస్తారు. ఇది బరువు తగ్గడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. కానీ దీని అధిక వినియోగం అంత మంచిది కాదు. మీరు కూడా ఎస్ప్రెస్సో ప్రేమికులైతే దీనిని తాగడం తగ్గించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

నెయ్యి కాఫీ తీసుకోవడం వల్ల వాపును తగ్గించడంలో, పేగు లైనింగ్‌కు సహాయకారిగా ఉపకరిస్తుంది. హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా మానసిక స్థితిని, ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది. నెయ్యిలో విటమిన్ ఎ, ఇ, కె పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో పేరుకుపోయిన మొండి కొవ్వులను కరిగిస్తుంది.

మూడు నుంచి ఐదు ఎస్ప్రెస్సో డ్రింక్స్ తాగే పురుషులలో మహిళల కంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో తెలింది. ఎస్ప్రెస్సో కాఫీ ఎక్కువగా తాగడం వల్ల పురుషులలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. కానీ మహిళల్లో ఇది తక్కువ.