గరం గరం.. టేస్టీ టేస్టీ మసాలా టీ.. ఇంట్లోనే ఎలా చేయాలంటే?

Updated on: Jan 28, 2026 | 4:31 PM

టీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ఉదయం నిద్రలేవగానే కప్పు టీ తాగడానికి ఇష్టపడుతుంటారు. ఇక టీలలో అనేక రకాలు ఉన్నాయి. అందులో కొంత మంది గ్రీన్ టీ ఇష్టపడితే మరికొంత మందికి బ్లాక్ టీ, కొందరు మసాలా టీ ఇష్టంగా తాగుతుంటారు. ఇక మసాలా టీ తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

1 / 5
తలనొప్పి, గొంతు నొప్పి, జలుబు, దగ్గు సమస్యలతో బాధపడే వారికి ఇది ఓ దివ్యౌషధం అని చెప్పాలి.  కాగా ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మసాలా టీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలి? టేస్టీగా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
గరం గరంగా టేస్టీ టేస్టీగా ఉండే మసాలా టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :  నీళ్లు కప్పునర, పాలు 500 గ్రాములు, టీ పొడి 2 టీస్పూన్స్, ఏలకులు 4 , అల్లం చిన్న ముక్క, లవంగాలు 4, దాల్చిన చెక్క చిన్నది, బిర్యానీ ఆకు ఒకటి.

3 / 5
తయారీ విధానంలోకి వెళితే : ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత దాని మీద టీ రెడీ చేసుకొని గిన్నె పెట్టాలి. అందులో రెండు టీ స్పూన్ల  నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత  అందులో రెండు టీ స్పూన్ల చక్కెర, టీ పౌడర్ వేసి మరో రెండు నిమిషాలు మరగ బెట్టాలి.

4 / 5
చక్కెర నీరు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత అందులో కప్పున్నర  నీళ్లు పోసి మంచిగా మరిగేలా చూసుకోవాలి. తర్వాత మరిగే నీటిలో లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేయాలి.

5 / 5
దీని తర్వాత అవి మరుగుతుండగానే, అందులోకి పాలు పోయాలి. ఇక పాలు పోసిన తర్వాత రెండు నిమిషాలు మరిగేలా చూసుకోవాలి. తర్వాత అందులో ఏలకులు, చిన్న అల్లం ముక్క వేసి మంచిగా మరగ బెట్టుకోవాలి.  కప్పున్నర నీళ్లు పాలు మరిగి, సగం వరకు వచ్చే వరకు మరగనివ్వాలి. అప్పుడు ఘాటైన వాసన వస్తుంది. స్టవ్ ఆఫ్ చేయాలి అంతే. గరం గరం వేడి వేడి టేస్టీ మసాలా టీ రెడీ.