Sabudana: సగ్గుబియ్యం ఎలా తయారు చేస్తారో తెలుసా? చాలా మందికి తెలియని విషయం అదే..

|

Sep 30, 2022 | 2:50 PM

చాలా మంది సగ్గుబియ్యం ఓ రకమైన కీటకీల నుంచి తయారు చేస్తారనే అపోహ ఉంది. ఇది నిజం కాదు. మరి సగ్గుబియ్యంను ఎలా పండిస్తారో? దాని తయారీ విధానం ఎలానో..

1 / 5
నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించడానికి ఎంతో మంది ఉపవాసం ఉంటుంటారు. ఐతే ఇలా ఉపవాసం ఉంటున్న సమయంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఉపవాసం ఉంటేవాళ్లు సగ్గు బియ్యంతో తయారు చేసిన ఆహారాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మరి సగ్గుబియ్యంను ఎలా పండిస్తారో? దాని తయారీ విధానం ఎలానో మనలో చాలా మందికి తెలియదు. ఆ విషయాలు మీకోసం..

2 / 5
సాగో పామ్ (Sago palm) అనే చెట్టు నుంచి సగ్గు బియ్యాన్ని తయారు చేస్తారని మీకు తెలుసా? అవును ఇవి నేరుగా పొలంలో పండవు. ఈ విధమైన చెట్లు దక్షిణాఫ్రికాలో ఎక్కువగా సాగు చేస్తారు.

3 / 5
మొదట సాగో పామ్ చెట్టు దుంపల నుంచి రసాన్ని వేరు చేస్తారు. ఈ రసాన్ని పెద్ద పెద్ద పాత్రల్లో పోసి, అధిక మొత్తంలో నీటిని కలిపి... కొన్ని రోజుల పాటు కదిలించకుండా ఉంచుతారు. ఈ నీటి అడుగున తెల్లని పొడి పేరుకుపోతుంది.

4 / 5
ఆ తర్వాత నీటిని తొలగించి, మిషన్‌లో వేసి బాగా కలుపుతారు. మిక్సింగ్ తర్వాత, మిషన్‌ నుంచి గుండ్రని ఆకారంలో బయటికి వస్తాయి. ఈ విధంగా బయటికి వచ్చిన సగ్గు బియ్యంను గ్లూకోజ్, స్టార్చ్‌తో తయారు చేసిన పొడితో పాలిష్ చేస్తారు.

5 / 5
ఈ విధంగా తయారైన సగ్గుబియ్యంను ప్యాకెట్లలో షాపులకు పంపిస్తారు. ఐతే చాలా మంది సగ్గుబియ్యం ఓ రకమైన కీటకీల నుంచి తయారు చేస్తారనే అపోహ ఉంది. ఇది నిజం కాదు. సాగో పామ్‌ అనే చెట్టు నుంచి తీసిన దుంపల ద్వారా సగ్గు బియ్యం తయారు చేస్తారు. ఐతే సగ్గు బియ్యం ఇంట్లోనే తయారు చేసుకోవడం మాత్రం అంత సులభం కాదు.