నల్లద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్లం వంటి ప్రమాదాలు దూరమవుతాయి. నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

నల్ల ద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ బి, కాల్షియం, భాస్వరం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నల్ల ద్రాక్ష గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

నల్లద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. క్షీణత, కంటి శుక్లం వంటి ప్రమాదాలు దూరమవుతాయి. నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

నల్లద్రాక్షలో పొటాషియం రక్తపోటుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. రక్తపోటుని తగ్గించడం వల్ల స్ట్రోక్ ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి, వీటిని తీసుకోవడం మంచిది. వీటిలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను ఆరోగ్యంగా మార్చుతుంది. ఎండిన నల్ల ద్రాక్ష తింటే మలబద్దకం దూరం అవుతుంది.

Black grapes