
రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మీ ఆహారంలో లవంగాలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఇది ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. జీవక్రియ రేటును ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 మధుమేహాన్ని తగ్గిస్తుంది.

లవంగాలతో కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు..అందానికి కూడా ఉపయోగిస్తారు. లవంగాలతో మొటిమల సమస్యలను తగ్గించుకోవచ్చు. లవంగం ఆస్తమా, బ్రోన్కైటిస్, దగ్గు చికిత్సకు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. లవంగాలు మంటను తగ్గించడంలో సహాయపడతాయి.

లవంగాలతో ఫేస్ ప్యాక్ కూడా తయారు చేయవచ్చు. ఇందుకోసం లవంగాలను గ్రైండ్ చేసి పౌడర్ తయారు చేయాలి. అందులో పెరుగు, తేనె కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తరువాత సాధారణ నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా చనిపోయి చర్మం శుభ్రంగా, నీట్‌గా కనిపిస్తుంది.

లవంగాలలో ఉండే యూజినాల్ సహజమైన క్రిమినాశకగా పనిచేస్తుంది. ఇది పలు చర్మ వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. అంతేకాదు లవంగాల వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి ముడతలు తగ్గుతాయి. చర్మాన్ని బిగుతుగా మార్చడంలో లవంగాలు ఎంతగానో సహకరిస్తాయి.

Clove