
మన కంటే మన పిల్లల్ని ఎదుటి వారు పొగుడుతూ ఉంటే తల్లి దండ్రులకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇతర పిల్లల కంటే అన్ని విషయాల్లో పిల్లలు ముందుండాలని అందరూ అనుకుంటారు. మరి పిల్లలు తెలివిగా ఉండాలంటే పేరెంట్స్ వాళ్లకు సరైన ఫుడ్ ఇవ్వాలి.

పిల్లలు తెలివిగా ఉండాలంటే రెండో సంవత్సరం దగ్గర నుంచే వారికి అన్ని రకాల ధాన్యాలు అందించాలి. వీటిల్లో పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి పిల్లల మెదడు అభివృద్దికి ఎంతగానో సహాయ పడతాయి.

పిల్లలకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఆహారంలో గుడ్డు కూడా ఒకటి. కోడి గుడ్డు ప్రతి రోజూ ఇవ్వడం వల్ల వారిలో తెలివి తేటలు పెరుగుతాయి. మెదడు యాక్టీవ్ అయి.. అన్ని విషయాలు తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది.

ఆకు కూరల్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పిల్లల మెదడు షార్ప్‌గా పని చేసేలా చేస్తుంది. పిల్లలు చురుగ్గా ఉండాలంటే నట్స్ కూడా ఇవ్వాలి. వారు తినకపోయినా ఏదో ఒక రూపంలో ఇచ్చేందుకు ట్రై చేయండి.

పిల్లల నిర్మలమైన నవ్వు చూస్తే మనసులోని బాధ అంతా ఇట్టే మాయమైపోతుంది. అయితే ఒక్కోసారి పిల్లలు ఆకారణంగా ఏడుస్తుంటారు. వాళ్ల ఏడుపు ఏవిధంగా మాన్పాలో తెలియక తల్లిదండ్రులు తికమక పడిపోతుంటారు.