
ఈ ఏడాది ఆనందం, శ్రేయస్సు కోసం .. అందమైన సులభమైనముగ్గులను, డిజైన్లతో ఇంటికి మరింత అందాన్ని తీర్చుకురండి. ఈ దీపావళి 2025ని మరింత అందంగా తీర్చిదిద్దుకోండి. రకరకాల పువ్వులు, రంగులు తో వేసిన ముగ్గుల్లో దీపాల కాంతులు వెదజల్లుతూ ఉంటే చూసేందుకు రెండు కళ్ళు చాలవు అని అనిపిస్తుంది. ఈ ఏడాది దీపావళికి మీ ఇంటిని ప్రకాశవంతం చేయడానికి కొన్ని ఉత్తమమైన, అందమైన , రంగురంగుల దీపావళి ముగ్గుల డిజైన్లును పరిచయం చేస్తున్నాం. ఇవి ఆధునికంగా ఉండడమే కాదు.. సింపుల్ , అందంగా ఉంటాయి.

ఈ దీపావళికి ముగ్గుని రేఖా గణితం ఆధరంగా కూడా అందంగా వేసుకోవచ్చు. అర్ధ చంద్రాకారం, త్రిభుజాలు, చతురస్రాలు వంటి రేఖాగణిత చిత్రాలను అందంగా పేర్చి ముగ్గుని వేయండి. వాటిని అందమైన రంగులతో నింపండి. సరళమైన గీతలను తెల్లటి ముగ్గుతో, లేదా బియ్యం పిండితో వేయడంతో చూసేందుకు ముగ్గు చాలా బాగుంటుంది. అంతేకాదు ఈ ముగ్గులో దీపాలను వెలిగితే ఇంటికి మరింత అందం వస్తుంది.

ఆధునిక డిజైన్స్ తోనే కాదు సాంప్రదాయ ముగ్గులతో కూడా దీపావళి రోజున లక్ష్మీదేవికి స్వాగతం చెప్పవచు. బియ్యం పిండి సహాయంతో శ్రేయస్సు , శాంతిని సూచించే కమలం, శంఖం వంటి ముగ్గులను వేసి ఆ ముగ్గుల్లో దీపాలను వెలిగించడం ద్వారా దీపావళికి స్వాగతం చెప్పవచ్చు. మెరుగుపరచవచ్చు

ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ముగ్గుని డిజైన్ గా వేయవచ్చు. ఇటువంటి ముగ్గులో రంగులకు బదులుగా తాజా పూల రేకులను ఉపయోగించవచ్చు. బంతి పువ్వులు, గులాబీలు, మల్లె వంటి పువ్వులతో పూల రంగోలి డిజైన్లకు ప్రసిద్ధ ఎంపికలు. పువ్వుల ప్రకాశవంతమైన రంగులు దీపావళి వేడుకను సంతోషంగా, ఉత్సాహంగా చేస్తాయి.

దీపావళికి ఇంటి ముందు ముగ్గుతో 'హ్యాపీ దీపావళి'ని కూడా వేయవచ్చు. దీనికి రంగులు, దీపాలు, రంగుల్లో మెరుపులను జోడించి మరింత అందాన్ని తీసుకుని రండి. పువ్వుల డిజైన్ల మధ్య దీపావళికి వెల్కం చెప్పేయండి. ఈ పండుగ సందర్భంగా మీ ఇంటికి వచ్చే వారందరికీ ఈ డిజైన్ తో స్వాగతం పలుకుతూ పండుగ ఉత్సాహాన్ని గుమ్మం దగ్గరే అందించండి.

దీపాల పండుగను ఇంటి ముందు గుమ్మం, ప్రవేశ ద్వారం దగ్గర రంగు రంగుల అందమైన ముగ్గులను రంగులతో అలంకరించి ముగ్గుల మధ్య వేలుగులుచిందే దీపాలను వెలిగించి శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురండి. ఈ దీపావళికి అతిథులను స్వాగతించడానికి ఈ దీపావళి రంగోలి డిజైన్లు సరైన మార్గం.