
వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం.. మనీ ప్లాంట్ శుక్రుడికి సంబంధించినదిగా పిలుస్తారు. ఇది శారీరక సౌఖ్యం, జీవితంలో పురోగతి, కీర్తి మొదలైన వాటికి కారకంగా చెబుతారు. ఇంట్లో సరైన దిశలో మనీ ప్లాంట్ ఉంటే శుక్రుడు కూడా సంతోషిస్తాడని, తద్వారా ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సంపద పెరుగుతుందని చెబుతారు.

మనీ ప్లాంట్: మనీ ప్లాంట్ విజయాన్ని, సంపదను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఇది కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చాలామంది నమ్మకం. ఈ మొక్కను పెంచేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, దానిని ఆగ్నేయం వైపు పెంచుకోవాలి. అలాగే ఈ మొక్కను ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు.

ఇంటికి ఆగ్రేయ దిశకు అధిపతి వినాయకుడు, ప్రతినిధి శుక్రుడు. గణేశుడు అన్ని కష్టాలు, అడ్డంకులను తొలగిస్తాడు. శుక్రుడు ఇంట్లో సంపద, శ్రేయస్సు, గౌరవాన్ని పెంచుతుంది. అందుకే ఈ మొక్కను ఎప్పుడూ ఇంటి లోపల ఆగ్నేయ దిశలో నాటాలని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధనానికి లోటు ఉండదు, సకల అరిష్టాలు కూడా పోతాయని చెబుతున్నారు.

అలాగే, మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశ మధ్యలో ఎప్పుడూ నాటకూడదని చెబుతున్నారు. ఈ దిశ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ దిశకు అధిపతి బృహస్పతి. మనీ ప్లాంట్ శుక్రుడికి సంబంధించినది. బృహస్పతి, శుక్ర గ్రహాల మధ్య చెడు సంబంధం కారణంగా, ఇంట్లో ఈ దిశలో నాటిన మనీ ప్లాంట్ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని అంటున్నారు.

ఇకపోతే, మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతుంటే, వాటిని వెంటనే తొలగించాలని చెబుతున్నారు. మొక్క తీగ నేలను తాకకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్ఆనరు. బదులుగా దాని తీగకు తాడు లేదా కర్ర కట్టి పైకి వెళ్లనివ్వండి. తీగను పెంచడం సంపద, శ్రేయస్సును ఇస్తుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. మనీ ప్లాంట్ యొక్క తీగ నేలపై ఉంటే, ఎవరైనా ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది .