Aadhaar Card: ఆధార్‌ కార్డులో రకాలు .. ఒక్కో కార్డుకు ఒక్కో ఫీచర్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి

|

Apr 25, 2022 | 10:48 AM

Aadhaar Card: ఆధార్‌ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇదొకటి. ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. అన్నింటికి ఆధారే ముఖ్యం. ఇక కేవైసీ వెరిఫికేషన్‌ కోసం ప్రభుత్వం నుంచి ప్రైవేటు రంగాల వరకు ఆధార్‌ కార్డునే వాడుతున్నారు..

1 / 5
Aadhaar Card: ఆధార్‌ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఇదొకటి.  ఆధార్‌ లేనిది ఏ పని జరగదు. అన్నింటికి ఆధారే ముఖ్యం. ఇక కేవైసీ వెరిఫికేషన్‌ కోసం ప్రభుత్వం నుంచి ప్రైవేటు రంగాల వరకు ఆధార్‌ కార్డునే వాడుతున్నారు. అయితే ఆధార్‌ విషయంలో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (UIDAI) ఎప్పటికప్పుడు సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఆధార్‌కు సంబంధించిన ఏ పని ఉన్నా మీ సేవ కేంద్రాలకు వెళ్లి సులభంగా చేసుకునే వెసులుబాటు వచ్చింది. కొన్ని సేవలు మాత్రం ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. మరి యూఐడీఏఐ వివిధ రకాల ఆధార్‌ కార్డులు ఏమిటో తెలుసుకుందాం.

2 / 5
ఆధార్‌ లేటర్‌ (Aadhaar Letter): యూఐడీఏఐ జారీ చేసిన  ఆధార్‌ లేటర్‌. జారీ చేసిన తేదీ, ప్రింట్‌ తేదీతో పాటు సెక్యూర్‌ క్యూఆర్‌ కోడ్‌ను కలిగి  ఉన్న పేపర్ ఆధారిత లామినేటెడ్‌ లేటర్‌. ఇది సాధారణంగా పోస్టు ద్వారా ఉచితంగా అందిస్తోంది యూఐడీఏఐ. ఒక వేళ ఈ ఆధార్‌ లెటర్‌ను పోగొట్టుకున్నా, పాడైపోయినా UIDAI అధికారిక వెబ్‌సైట్‌లో రూ.50 చెల్లించి రీప్రింట్ లెటర్‌ను ఆర్డర్‌ పెట్టుకోవచ్చు. ఇది పోస్టు ద్వారా చిరునామాకు వస్తుంది.

3 / 5
ఎం ఆధార్‌ (mAadhaar): ఇది మొబైల్‌ అప్లికేషన్‌. ఈ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొబైల్‌ నుంచి కూడా ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీనిపై ఆధార్ నెంబర్, డెమొగ్రాఫిక్ సమాచారం, ఫోటోగ్రాఫ్ ఉంటాయి. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్‌కు ఆధార్ సెక్యూర్ క్యూఆర్‌ కోడ్‌ను ఇది కలిగి ఉంటుంది. ఈ-ఆధార్ మాదిరిగానే ప్రతి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ తర్వాత లేదా అప్‌డేట్ తర్వాత ఆటోమేటిక్‌గా ఇది జనరేట్ అవుతుంది. దీనిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

4 / 5
ఈ-ఆధార్‌ (eAadhaar): ఈ-ఆధార్‌ అనేది ఎలక్ట్రానిక్‌ రూపంలో ఉన్న ఆధార్‌కార్డు. యూఐడీఏఐ డిజిట్‌ సంతకంతో ఈ కార్డును జారీ చేస్తుంది. జారీ చేసిన తేదీ, డౌన్‌లోడ్‌ తేదీ, ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌ కోసం ఇది భద్రత కోసం క్యూఆర్‌ కోడ్‌ కలిగి ఉంటుంది. దీనికి పాస్‌వర్డ్‌ రక్షిస్తుంది. ఈ-ఆధార్‌లో కేవలం ఆధార్‌కు సంబంధించిన నాలుగు నంబర్లు మాత్రమే కనిపిస్తాయి. ప్రతి ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ లేదా అప్‌డేట్‌ ఈ-ఆధార్‌ స్వయంచాలకంగా రూపొందించబడుతుంది. దీనిని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

5 / 5
ఆధార్‌ పీవీసీ కార్డు (Aadhaar PVC Card): ఈ పీవీసీ కార్డును UIDAI ప్రవేశపెట్టింది. డిజిటల్‌ సంతకం చేయబడిన పీవీసీ కార్డులో క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది.  ఇందులో ఆధార్‌ నంబర్‌, వర్చువల్‌ ఐడి లేదా ఎన్‌రోల్‌మెంట్‌ఐడిని ఉపయోగించి రూ.50 చెల్లించి uidai.gov.in లేదా రెసిడెంట్.uidai.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. అయితే ఆధార్‌ను PVC కార్డు స్పీడ్‌ పోస్టు ద్వారా మీ చిరునామాకు తెప్పించుకోవచ్చు.