
మందం - వాపు: నాలుక అకస్మాత్తుగా మందంగా, పెద్దదిగా మారడం.నాలుకపై పొడవైన, లోతైన పగుళ్లు స్పష్టంగా కనిపించడం.ఈ పగుళ్లు తరచుగా పుండ్ల మాదిరిగా అనిపిస్తాయి. అయినప్పటికీ అవి బాధాకరంగా ఉండకపోవచ్చు.

నాలుక ఉబ్బిపోవడం వల్ల కొన్నిసార్లు ఆహారాన్ని మింగడం కష్టంగా మారవచ్చు. కారం లేదా మసాలా తిన్నప్పుడు, నాలుకపై ఆ పగుళ్లలో తగిలి మంటగా లేదా కుట్టినట్లు అనిపిస్తుంది. దీనివల్ల నోట్లో నీరు కూడా ఊరవచ్చు. ఈ గుర్తులు కనిపిస్తే, అది ఫ్యాటీ లివర్ (కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం) లేదా ఇతర తీవ్రమైన కాలేయ సమస్యలకు సంకేతం కావచ్చు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నాలుకపై ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కాలేయాన్ని తనిఖీ చేయించుకోవాలి.కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం మొదలైనప్పుడు, ఈ లక్షణాలు తరచుగా నోటిలో మొదట కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్‌తో పాటు లివర్ సిర్రోసిస్, వివిధ ఇన్ఫెక్షన్లు కూడా నాలుకపై ఇలాంటి మార్పులను సూచిస్తాయి.

కాలేయ సమస్య ఉన్నవారు లేదా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పచ్చి ముల్లంగి ఆకులను తరచుగా తినాలి. ముల్లంగి ఆకుల రసం తాగడం కూడా చాలా మంచిది. ముల్లంగి కాలేయాన్ని శుభ్రం చేయడానికి, దాని పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

మన శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను అస్సలు వదిలేయకూడదు. చిన్నవే కదా అని లైట్ తీసుకుంటే అవి పెద్ద ప్రమాదంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందే గుర్తించి చికిత్స తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.