
రక్తంలో చక్కెరల స్థాయులు నిర్ధారిత మోతాదుకు మించి పెరిగితే మధుమేహం ఉన్నట్లే. కొందరిలో తరచూ ఆయాసం, వాంతులు, విరేచనాలు, చర్మం, మర్మాయవయాల వద్ద ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు. వృషణాలలో దురద. అంగంలో మంటగా ఉండటం. శృంగార కోరికలు సన్నగిల్లడం. చర్మం ముడత పడటం.

అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, వ్యాయామం లేకపోవడం, అధిక బరువు-ఇవన్నీ టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తాయి. చిన్నప్పటి నుంచి క్యాలరీలు, షుగర్, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే మధుమేహాన్ని ఏ విధంగానూ అరికట్టలేరు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో వైఫల్యం చెందితే పిల్లలకు హాని కలుగుతుంది. అయితే యాపిల్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఈ పండులో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి టైప్-2 డయాబెటిస్‌ను నివారించగలవు. పిల్లల్లో మలబద్దకాన్ని తొలగించడంలో కూడా యాపిల్స్ సహకరిస్తాయి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తీపి రుచిగల పండ్లకు దూరంగా ఉండాలి. కానీ పిల్లల ఆహారంలో క్యారెట్లు చేర్చవచ్చు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ క్యారెట్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది. క్యారెట్లలో పిండి పదార్ధాలు ఉండవు. కాబట్టి దీనిని తినవచ్చు.

తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ, క్వినోవా వంటి కాంప్లెక్స్ పిండి పదార్థాలు కలిగిన ఆహారాలు పిల్లలకు మంచివి. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న పిల్లలకు ఈ తృణధాన్యాలతో పాటు చిలగడదుంప, మొక్కజొన్న, పప్పు, బీన్స్, రాజ్మా, కాబూలీ చనా వంటి వాటిని వారి డైట్‌లో ఉంచవచ్చు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే చియా విత్తనాలలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతుంటే చియా విత్తనాలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.

వేసవిలో ఎంత తక్కువ స్పైసీ ఫుడ్ తీసుకుంటే అంత మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బదులుగా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంతోపాటు ఎండ ప్రభావం అంతగా అనిపించదు. వేసవిలో చాలా మంది పెరుగును క్రమం తప్పకుండా తింటుంటారు. ముఖ్యంగా పెరుగు వేసవిలో ప్రతిరోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు.