
జామపండులో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇది కొందరికి మంచిదే కానీ, మరి కొందరికి అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే భోజనం తర్వాత పండ్లు తినడం మానుకోవాలి. ఉదయం అల్పాహారంగా లేదా మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఆకలిగా ఉన్నప్పుడు పండ్ల ముక్కలు తింటే సరిపోతుంది.

నల్ల అంజీర్ : ఇతర పండ్లతో పోలిస్తే నల్ల అంజీర్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉత్తమ ఎంపిక. ఇది కేవలం చక్కెరను తగ్గించడమే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండు గింజల పొడిని కూడా మధుమేహానికి మందుగా వాడుతుంటారు.

బొప్పాయి: బొప్పాయిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మధుమేహం వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోజుకు 100 -150 గ్రాముల బొప్పాయి ముక్కలను ఉదయం లేదా మధ్యాహ్నం తీసుకోవడం మంచిది.

నారింజ: నారింజలో విటమిన్-సి ఎక్కువగా ఉండటమే కాకుండా GI తక్కువగా ఉంటుంది. ఇందులోని పెక్టిన్ ఫైబర్ రక్తంలో చక్కెర ఆకస్మికంగా పెరగకుండా నిరోధిస్తుంది. నారింజ రసం తాగడం కంటే నేరుగా పండును తినడమే ఉత్తమం. దీనివల్ల పూర్తి ఫైబర్ అందుతుంది.

పండ్లలో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. మీరు తినే ఆహారం జీర్ణం కావడానికి ఫైబర్ సహాయపడుతుంది. భారీ ఆహారాలలో ప్రోటీన్, కొవ్వు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల భోజనానికి ముందు ఎప్పుడూ పండ్లు తినకూడదు.