Devaragattu: దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధం.. ఈ నెల ఉత్సవ విగ్రహాలకు 19న కంకణ ధారణ..

| Edited By: Surya Kala

Oct 12, 2023 | 10:17 AM

దేశ ప్రజలను ఎంతగానో ఆకర్షించే కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది రానున్న విజయదశమి రోజు వేలాది కర్రలు నాట్యం చేయనున్నాయి కొన్ని దశాబ్దాలుగా వస్తున్న కర్రల సమరానికి దేవరగట్టు సిద్దమైంది. విజయదశమి రోజు ఆర్దరాత్రి జరిగే కర్రల సమరానికి ( బన్నీ ఉత్సవానికి ) ఆలయ వేదపండితులు ఇదివరకే ముహూర్తం ఖరారు చేశారు. కొన్ని ఏళ్లుగా దేవరగట్టు లో జరిగే బన్నీ ఉత్సవానికి కర్రల సమరం గా పేరు వచ్చింది. బన్నీ ఉత్సవంలో పాల్గొనే భక్తులు కర్రల సమరం కాదు. భక్తి శ్రద్ధలతో జరిగే సంప్రదాయాన్ని  సమరం అంటున్నారు. 

1 / 10
కర్నూలు జిల్లా హోలగుంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై వెలసిన మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాల్లో కర్రల సమరం కు చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఉత్సవాలుకు ముందు వచ్చే అమావాస్య నుంచి నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేటగ్రామాల భక్తులు దీక్ష లు చేపడతారు. మూడు గ్రామాల భక్తులు చేపట్టే దీక్ష లకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవ విగ్రహాలకు కంకనా ధారణ ఈ నెల 19 వ తేదీ జరుగుతుంది. కంకనాధారణ జరిగిన రోజు మొదలుకొని బన్నీ ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు మూడు గ్రామాల భక్తులు . కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరిణికి గ్రామానికి చేరేంతవరకు మద్యం, మాంసం నిషేధం.

2 / 10
భార్య భర్తలు దూరంగా ఉండడమే కాకుండా మంచంపై కూడా నిద్రపోరు. ఈ కట్టుబాట్లు కొన్ని ఏళ్లుగా పాటించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు అంటారు. విజయదశమి రోజు అర్దరాత్రి మాల మల్లేశ్వర కళ్యణోత్సవం అనంతరం జరిగే కర్రల సమరంలో ఇతర గ్రామల నుండి వచ్చిన వారు మద్యం సేవించి కర్రల సమరంలో పాల్గొన్ని పల్లకి లో ఉన్న స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను తాకేందుకు రావడంతో నే వారిని నియమ నిష్ఠలతో ఉన్న మూడు గ్రామాల భక్తులు వారిని పల్లకి దగ్గరకు రాకుండా నివారించే ప్రయత్నంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. ప్రతి ఏటా వందల మంది తలలు పగులుతాయి. రక్తం కారుతున్న నేటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు అక్కడ భక్తులు.

3 / 10
Devaragattu: దేవరగట్టు కర్రల సమరానికి సర్వం సిద్ధం.. ఈ నెల ఉత్సవ విగ్రహాలకు 19న కంకణ ధారణ..

4 / 10
దేవరగట్టు మాల సహిత మల్లేశ్వరస్వామి ఆలయ చరిత్ర కు చాలా ప్రాధాన్యత ఉంది. దేవరగట్టు అటవీ ప్రాంతంలో సముద్ర మట్టనికి సుమారు 2000 వేల అడుగుల ఎత్తేన కొండ గుహలో మాలమ్మ ,(పార్వతి దేవి) మల్లేశ్వరుడు శివుడు స్వయంభువుగా వెలిశారు. స్వామి వార్లు అక్కడ స్వయంభువుగా వెలిసి ఇప్పటికి లక్షల మంది భక్తులతో పూజలు అందుకుంటున్నారు.

5 / 10
దేవరగట్టు దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఎత్తయిన కొండ గుహల్లో త్రేతాయుగంలో లోకకల్యాణం కోసం మునులు తపస్సు చేసేవారని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆ మునుల తపస్సుకు మునికాసుర, మల్లసూర, అనే ఇద్దరు రాక్షసులు ఆటంకాలు కలిగిస్తువచ్చేవారు. ఇద్దరు రాక్షసులు మునుల తప్పసు కు భంగం కలిగించేవారు. ఇద్దరు రాక్షసుల ఆగడాలను భరించలేక మునులు (మహర్షులు )పార్వతి పరమేశ్వరులను ఆశ్రయించారు. పార్వతి పరమేశ్వరుడు దేవలోకం నుంచి భూలోకం చేరుకుని కూర్మఅవతారంలో కొండ గుహలో స్వయంభువుగా వెలిశారు. ఇద్దరు రాక్షసుల ఆగడాలను గమనిస్తువచ్చారు. పవిత్ర మైన దసరా పండగ రోజు మహర్షులు ఒక హోమం నిర్వహించేందుకు సిద్ధమౌతారు. అప్పుడు ఇద్దరు రాక్షసులు ఒక పక్షి మాంసాన్ని తప్పస్సు చేస్తున్న మహర్షి పైకివిడిచారు. కోపంతో ఆ ఇద్దరు రాక్షసుల పై పార్వతి పరమేశ్వరుడు యుద్ధం చేస్తారు. ఇద్దరు రాక్షసులను చంపేశారు. మరణించే ముందు రాక్షసులు మేము చనిపోయిన దసరా పండగ రోజు నరబలి కావాలని పార్వతి పరమేశ్వరుడు ను వేడుకోగా..ఆ కోరికను శివపార్వతులు తిరస్కరించారు. రాక్షసుల కోరిక మేరకు నరబలి కాదు కాని దసరా పండగ రోజు దేవరగట్టు ప్రాంతంలో రక్తం చిందుతుందని భక్తుల నమ్మకం.

6 / 10
పార్వతి పరమేశ్వరుడు మాలమ్మ మల్లేశ్వరస్వామి పేర్లు తో స్వయంగా పార్వతి పరమేశ్వరుడు తమను చంపినట్లు ఇద్దరు రాక్షసులు తెలుసుకున్నారు. చనిపోయే ముందు మాల మల్లేశ్వరస్వామికి మొక్కిన తమకు చావు రూపంలో విముక్తి కలిగిందని భావిస్తారు. తమ చివరి కోరిక ను కోరుతారు ఇద్దరు రాక్షసులు.. దసరా పండగ రోజు తమకు నరబలి కావాలని వేడుకొంటరు. మీకు నరబలి కాదు కేవలం కొన్ని చుక్కల రక్తం ఇస్తామని చెబుతారు. ఇద్దరు రాక్షసులు పార్వతి పరమేశ్వరుడు ఇచ్చిన మాటకు కట్టుబడి చనిపోయిన ప్రదేశం లో రాళ్లుగా మరిపోతారు. ఆ ప్రాంతమే భక్తులు ఇప్పటికి పిలుచుకునే రాక్షస గుండ్లు.. ఆ రాక్షసుల గుండ్లు కు ఇప్పటికి రక్తం ఇవ్వడం ఆనవాయితీగా మారింది.

7 / 10
రెండు రాక్షసుల గుండ్లకు దసరా పండగ అర్ధరాత్రి నెరిణికి గ్రామానికి చెందిన కంచర బీమా వంశానికి చెందిన ఒకరు తన తొడ బాగం నుంచి రక్తం ఇవ్వడం ఉత్సవాల్లో భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దసరా పండగ రోజు అర్ధ రాత్రి బన్నీ ఉత్సవాలలో భాగంగా కొండపై ఉన్న మాల మల్లేశ్వరస్వామికి నెరిణికి, నెరిణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు అత్యంత వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. ఉత్సవ విగ్రహాలను పల్లకి లో ఎత్తయిన కొండ పై నుంచి కిందకు ఊరేగింపు గా తీసుకొస్తారు. ఆ ఉత్సవ విగ్రహాలు జైత్రయాత్ర పేరుతో ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రదేశానికి చేరుకొనే సమయంలో దాదాపు 20 గ్రామాల భక్తులు జైత్రయాత్ర లో(కర్రల సమరం) లో చేరుతారు.

8 / 10

నియమ నిష్ఠలతో ఎంతో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించే మూడు గ్రామాల భక్తులు పల్లకి లో ఉన్న విగ్రహాలను 20 గ్రామాల భక్తులు తాకకుండా నివారించేందుకు చూస్తారు. అప్పుడే కర్రల తో పల్లకి చుట్టు భక్తులు గాలిలో వేగంగా కేకలు వేస్తూ అగ్గి డివిటీల వెలుగులో పరుగులు తీస్తారు. ఆ సమయంలో వందల మంది భక్తుల తలలు పగులుతాయి. రక్తం గాయాలతో అలానే కొందరు స్వామి వార్ల బండరాన్ని గాయాలపై వేసుకొని కర్రల సమరం లో పాల్గొంటారు. మరి కొందరు అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రిలో చికిత్స లు చేయించుకుంటారు.

అలా స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను దట్టమైన అటవీ ప్రాంతంలో కొన్ని ప్రదేశాలకు చేరుకోవడం జరుగుతుంది. ఆ ప్రదేశాలు ఏమిటంటే. ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాలను పల్లకి లో ముందుగా మాల మల్లేశ్వరస్వామి అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో ఒక చోట మల్లేశ్వరస్వామి కాలికి ముళ్ళు గుచ్చుకోవడం జరుగుతుంది. అప్పుడు మాలమ్మ (పార్వతి దేవి ) బాధపడుతారు. కాసేపు అక్కడే ఇద్దరు సెదతీరినట్లు చరిత్ర చెబుతోంది. ఆ సేదతిరిన ప్రాంతమే ముళ్ల బండ అని అంటారు భక్తులు.

నియమ నిష్ఠలతో ఎంతో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించే మూడు గ్రామాల భక్తులు పల్లకి లో ఉన్న విగ్రహాలను 20 గ్రామాల భక్తులు తాకకుండా నివారించేందుకు చూస్తారు. అప్పుడే కర్రల తో పల్లకి చుట్టు భక్తులు గాలిలో వేగంగా కేకలు వేస్తూ అగ్గి డివిటీల వెలుగులో పరుగులు తీస్తారు. ఆ సమయంలో వందల మంది భక్తుల తలలు పగులుతాయి. రక్తం గాయాలతో అలానే కొందరు స్వామి వార్ల బండరాన్ని గాయాలపై వేసుకొని కర్రల సమరం లో పాల్గొంటారు. మరి కొందరు అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆసుపత్రిలో చికిత్స లు చేయించుకుంటారు. అలా స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను దట్టమైన అటవీ ప్రాంతంలో కొన్ని ప్రదేశాలకు చేరుకోవడం జరుగుతుంది. ఆ ప్రదేశాలు ఏమిటంటే. ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాలను పల్లకి లో ముందుగా మాల మల్లేశ్వరస్వామి అటవీ ప్రాంతంలో తిరుగుతున్న సమయంలో ఒక చోట మల్లేశ్వరస్వామి కాలికి ముళ్ళు గుచ్చుకోవడం జరుగుతుంది. అప్పుడు మాలమ్మ (పార్వతి దేవి ) బాధపడుతారు. కాసేపు అక్కడే ఇద్దరు సెదతీరినట్లు చరిత్ర చెబుతోంది. ఆ సేదతిరిన ప్రాంతమే ముళ్ల బండ అని అంటారు భక్తులు.

9 / 10
ఆ ప్రాంతం లో భక్తులు పూజల చేస్తారు విగ్రహాలకు. అనంతరం అటవీ ప్రాంతంలో స్వామి వారి పాదానికి రక్తం ఎక్కువ కావడంతో మాలమ్మ (పార్వతి దేవి) మల్లేశ్వరస్వామి కి రక్తం మరకలను తుడిసెందుకు మరో ప్రాంతంలో కూర్చోబెడుతారు. స్వామి వార్ల పాదాలను ఒక బండ మీద ఉంచి రక్తం ను శుభ్రం చేస్తారు. ఆ ప్రాంతాన్ని భక్తులు స్వామి వార్ల పాదాలగట్టు అని ఇప్పటికి పిలిస్థారు. పాదల గట్టు అని పిలిచే ప్రాంతంలో ఉన్న స్వామి వారి పాదాలకు పూజలు నిర్వహిస్తారు. అక్కడినుంచి రాక్షసుల గుండ్లు వద్దకు వెళ్తారు.

10 / 10
అక్కడ రాక్షస పడి అనే పిలిచే రెండు రాతి గుండ్లు వద్ద ఖంచరాభీమా వంశంలో ఉన్ననెరిణికి గ్రామా గొర్రవయ్య తో తన తొడ భాగం లో ఒక పదునైన ఇనుప దబ్బనం తో గుచ్చుకోని ఒక్కో రాతి గుండు కు 5 చుక్కలు రక్తం ఇస్తాడు.. అక్కడ నుండి స్వామి వార్ల విగ్రహాలు అటవీ ప్రాంతంలో ఉన్న జమ్మిచెట్టు (శమీవృక్షం) వద్దకు చేరుకొంటయి.అక్కడ భక్తుల చేతిలో ఉన్న కర్రలు ఆయుధాలు కిందకు దించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూజల అనంతరం స్వామి వార్ల పల్లకి 5 శివలింగాల గుడి మీదగ ఎదురుబసవన్న ఆలయం వద్దకు వస్తుంది. అక్కడ దసరా పండగ మరుసటి రోజు (తెల్లవారుజామున) ఆలయ ప్రధాన అర్చకులు గిరిమల్లయ్య అనే వ్యక్తి భవిష్య వాణి (భవిష్యత్తు జరిగే విషయాలు) ను వివరిస్తారు భక్తులకు. ఆ భవిష్యవాణి కార్యక్రమం తర్వాత ఉత్సవ విగ్రహాలను భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న సింహాసనం కట్ట వద్దకు తీసుకొనే వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు పల్లకి మోసే మూడు గ్రామాల భక్తుల వద్దకు 20 గ్రామాల భక్తులు వేల సంఖ్యలో చేరుతారు.ఆ సమయంలో మరో మారు కర్రల తో భక్తులు తలపడుతారు. ఉత్సవ విగ్రహాలు సింహాసనం కట్ట వద్దకు చేరుకున్న తర్వాత బన్నీ ఉత్సవం ముగుస్తుంది. ఉత్సవాల ప్రశాంతంగా నిర్వహించేందుకు 2000 వేల మంది పోలీసులు.. 100 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది..రెడీ అయ్యారు.