Dehydration: వర్షాకాలంలో ఈ ఆహారాలు డీహైడ్రేట్‌ చేస్తాయ్‌.. పొరబాటున కూడా ముట్టుకోకండి

|

Sep 03, 2024 | 8:35 PM

వర్షాకాలంలో చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతుంటారు. దీనితో శరీరంలో డీహైడ్రేషన్ లేదా నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ సమస్య తీవ్రమైతే ఒక్కోసారి ప్రాణాంతక పరిస్థితులు కూడా సంభవిస్తుంటాయి. వర్షాకాలంలో డీహైడ్రేషన్ గురి కావడం వెనుక అసలు కారణం తెలుసుకోవాలంటే.. మీ రోజువారీ ఆహారంపై దృష్టి పెట్టాలి. నిర్జలీకరణాన్ని కలిగించే అనేక ఆహారాలు ఉన్నాయి. అవి ఏమిటంటే..

1 / 5

2 / 5
ఎనర్జీ డ్రింక్స్ - చాలా మంది జిమ్‌లకు వెళ్లేవారు రీహైడ్రేట్‌గా ఉండటానికి ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటారు. అయితే ఈ ఎనర్జీ డ్రింక్ తాగడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుందని చాలా మందికి తెలియదు. ఎనర్జీ డ్రింక్స్‌లో చాలా చక్కెర ఉంటుంది. ఇది ప్రేగులపై ఒత్తిడిని కలిగిస్తుంది. శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. దీని వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. నిర్జలీకరణానికి మరొక కారణం అధిక ప్రోటీన్ ఆహారాలు. నిర్జలీకరణాన్ని నివారించడానికి  కార్బోహైడ్రేట్, ప్రోటీన్ సమతుల్యంగా తీసుకోవాలి.

3 / 5
నిమ్మరసం - బరువు తగ్గడానికి చాలా మంది ప్రతి రోజూ ఉదయం నిమ్మరసం తాగుతారు. నిమ్మరసం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ప్రతిరోజూ పెద్ద మొత్తంలో నిమ్మరసం తాగడం వల్ల మూత్రం అధికంగా వెలువడుతుంది. ఫలితంగా తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల శరీరంలోని నీరు పోతుంది. అందువల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తవచ్చు. అలాగే ఎక్కువ కాఫీ తాగడం వల్ల కూడా తీవ్రమైన డీహైడ్రేషన్, తలనొప్పి, ఇతర సమస్యలు వస్తాయి. రోజుకు 110 మి.గ్రా కంటే ఎక్కువ కాఫీ తాగడం అస్సలు మంచిది కాదు.

4 / 5
ఉప్పగా ఉండే ఆహారాలు - సోడియం అధికంగా ఉండే ఆహారాలు కూడా శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. ఎందుకంటే ఉప్పు శరీరం నుండి నీటిని త్వరగా గ్రహించి, నిర్జలీకరణం చేస్తుంది.

5 / 5
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ - ఎక్కువగా వేయించిన ఆహారాలు తినడం వల్ల దాహం వేస్తుంది. ఎక్కువగా వేయించిన ఆహారం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అటువంటి ఆహారం తీవ్రమైన నిర్జలీకరణానికి దారితీస్తుంది.