కరివేపాకు Vs కొత్తిమీర.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఈ రహస్యాలు తెలిస్తే అవాక్కవడం పక్కా..

Updated on: Mar 08, 2026 | 5:02 PM

Curry Leaves Vs Coriander: భారతీయ వంట గదిలో కరివేపాకు, కొత్తిమీర లేని పోపు డబ్బాను ఊహించలేము. వంటకాల్లో కరివేపాకు, కొత్తిమీర ఉంటే రుచే వేరు. అయితే ఇవి కేవలం వాసన కోసమో, అలంకరణ కోసమో మాత్రమే అనుకుంటే పొరపాటే. వీటి వెనుక అపారమైన ఆరోగ్య నిధులు దాగి ఉన్నాయని తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. ఈ రెండిటిలో ఏది బెస్ట్..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
కరివేపాకు: కరివేపాకులో ఐరన్, కాల్షియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. కాలేయాన్ని టాక్సిన్స్, ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడుతుంది. జుట్టు అకాలంగా తెల్లబడకుండా చూడటమే కాకుండా జుట్టు వేగంగా పెరగడానికి కరివేపాకు నూనె అద్భుతంగా పనిచేస్తుంది.

2 / 5
కొత్తిమీర: విటమిన్ కె, సి, ఫోలేట్ నిలయమైన కొత్తిమీర కేవలం రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తూ, జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. శరీరం నుండి భారీ లోహాలను తొలగించే ప్రత్యేక సామర్థ్యం దీనికి ఉంది.

3 / 5
పరిశోధనల ప్రకారం.. ఈ రెండింటినీ తీసుకునే విధానంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కరివేపాకును నూనెతో కలిపి వాడటం వల్ల శరీరానికి పోషకాలు బాగా అందుతాయి. కొత్తిమీరను ఉడికించడం వల్ల విటమిన్ సి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి పచ్చిగా తీసుకోవడమే శ్రేయస్కరం.

4 / 5

కాంబినేషన్: కరివేపాకులోని ఐరన్ శరీరం గ్రహించాలంటే విటమిన్ సి అవసరం. అది కొత్తిమీరలో పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ రెండింటినీ కలిపి స్మూతీ రూపంలో తీసుకుంటే రెట్టింపు ప్రయోజనం ఉంటుంది.

5 / 5
 కిడ్నీ బాధితులు: కొన్ని అధ్యయనాల ప్రకారం, కిడ్నీ ఇన్ఫెక్షన్లు లేదా డయాలసిస్ మీద ఉన్నవారు అధిక మొత్తంలో మూలికా పరమైన పదార్థాలను తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. కరివేపాకులో ఉండే కొన్ని మూలకాలు వారి చికిత్సపై ప్రభావం చూపవచ్చు.

Follow Us