
ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. జుట్టు దువ్వుతున్నప్పుడు చేతినిండా జుట్టు వస్తుంది. వేలకొద్దీ చికిత్సలు చేసినా ఫలితం కనిపించదు. రోజులు గడిచే కొద్దీ తల ముందు భాగంలో బట్టతల పెరుగుతుంది. ఇది మరింత ఒత్తిడికి దారి తీస్తుంది. కాబట్టి జుట్టుకు అదనపు జాగ్రత్త చాలా అవసరం.

రోజుకు 100 వెంట్రుకలు రాలడం సాధారణం. కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలో వెంట్రుకలు రాలితే మాత్రం సమస్యగా పరిగణించాలి. అధికంగా జుట్టు రాలడం చివరికి బట్టతలకి దారితీస్తుంది.ఈ సమస్య నుంచి ఉపశమనం కలిగించడానికి కరివేపాకు ఉపయోగపడుతుంది. ఈ ఆకు వంట రుచిని పెంచడమే కాదు, జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. దీన్ని ఎలా ఉపయోగించాలి? అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం..

కరివేపాకుతో ఉసిరికాయ, మెంతికూర కలిపి జుట్టుకు అప్లై చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తుంది. ఇందుకోసం ఉసిరికాయ రసం, మెంతి ఆకు ముద్దను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానికి కరివేపాకు రసం కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ని జుట్టుకు అప్లై చేయాలి.

కరివేపాకు ఆకులను పెరుగుతో కలిపి జుట్టుకు అప్లై చేసినా కూడా ఫలితం ఉంటుంది. ఈ రెండు పదార్థాలు జుట్టుకు చాలా మేలు చేస్తాయి. ఈ హెయిర్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. ఒక గిన్నెలో పెరుగు తీసుకుని, కరివేపాకు పేస్తుతో కలపాలి. ఈ మిశ్రమాన్ని కలిపి జుట్టుకు పట్టించాలి.

Hairfall