Hair Care Tips: పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా మారి పట్టులా మెరుస్తుంది..

|

Apr 19, 2024 | 12:36 PM

కొంతమంది తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి హోం రెమెడీస్ ఉపయోగిస్తుంటారు. తెల్లజుట్టు నల్లగా మారాలంటే పెరుగుతో తయారు చేసిన కొన్ని హెయిర్‌ ప్యాక్స్‌ అద్భుతం చేస్తాయి. అలాంటి ప్యాక్‌లను తరచూవాడుతూ ఉంటే సరిపోతుంది. పెరుగు ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు A, B5, D, పొటాషియం మంచి మూలం. పెరుగు జుట్టుకు మెరుపును అందించేందుకు కండీషనర్‌గా పనిచేయడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది. పెరుగుతో కలిపి తయారు చేసుకునే కొన్ని హెయిర్‌ ప్యాక్ లను ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
పెరుగు, మెంతులతో తయారు చేసిన హెయిర్ మాస్క్ జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం ఆగిపోతుంది. ఇది గ్రే హెయిర్‌ను కూడా నివారిస్తుంది. మెంతులు, పెరుగు కలిపి తయారు చేసిన హెయిర్ మాస్క్ తెల్ల జుట్టును నల్లగా చేస్తుంది. మెంతి గింజలు అధిక మొత్తంలో ఐరన్, ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.. మెంతులు పొడి జుట్టు, చుండ్రు నుండి ఉపశమనం కలిగిస్తాయి.

2 / 5
2 టేబుల్ స్పూన్ల మెంతి గింజలను ఒక గిన్నెలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయాన్నే గ్రైండ్ చేసి 2 స్పూన్ల పెరుగుతో కలపాలి. జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయాలి. వారానికోసారి ఈ హెయిర్ మాస్క్ వాడితే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

3 / 5
ఒక కప్పు పెరుగులో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోండి. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, పెరుగులో కలపండి. ఈ హెయిర్ మాస్క్‌ను కాసేపు చల్లారనివ్వండి, ఆపై దానిని మీ జుట్టుకు అప్లై చేసి అరగంట ఆగి కడిగేయండి. కొబ్బరి నూనెలో సహజమైన లిపిడ్లు ఉంటాయి. జుట్టు మూలాలను బలపరుస్తుంది. కొబ్బరి నూనెతో పెరుగు హెయిర్ మాస్క్ తెల్ల జుట్టును నల్లగా చేయడమే కాకుండా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

4 / 5
వేసవిలో రోజూ తలస్నానం చేసినప్పటికీ జుట్టు జిడ్డుగా మారుతుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి.. అరకప్పు పెరుగులో, ఒక టీ స్పూన్‌ తేనె, ఒక చెంచా బాదం నూనె వేసి బాగా మిక్స్‌ చేసుకోవాల.. ఈ మిశ్రమాన్ని తలకు ప్యాక్‌లా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత.. తక్కువ గాఢత కలిగిన ఉన్న షాంపూతో తలస్నానం చేయండి.

5 / 5
మెంతుల పొడి, ఉసిరి పొడిలో పెరుగు వేసుకుని మృదువైన పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే.. జుట్టు రాలడం తగ్గుతుంది. క్రమంగా జుట్టు రాలడం తగ్గి పట్టులా మెరుస్తుంది. నల్లబడటం మొదలువుతుంది.