
కూరగాయల్లో దోసకాయ కూరను ఎంతో మంది ఇష్ట పడతారు. ఎందుకంటే, దోసకాయలో ఉండే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాదు, దీనిని అనేక విధాలుగా చేసుకుని తింటారు.

చేపలలో రొయ్యలు కూడా ఒక రకం. వీటితో అనేక కూరలు చేసుకోవచ్చు. అయితే, దోస కాయ ఎండు రొయ్యలు కలిపి వండితే సూపర్ టేస్ట్ ఉంటుంది. దీనిని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు: దోసకాయ - 1, ఎండు రొయ్యలు - 150 గ్రాములు, ఉల్లిపాయలు - 1 (చిన్నది), పచ్చిమిర్చి - 4, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఉప్పు, నూనె, ఆవాలు , జీలకర్ర, కరివేపాకు.

ముందుగా ఎండు రొయ్యలను తీసుకుని గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత 3 సార్లు శుభ్ర పరచుకోవాలి. ఇలా కడిగి శుభ్ర పరచడం వల్ల రొయ్యల్లో ఉండే ఉప్పు మొత్తం పోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి, వేడి చేసి, ఎండు రొయ్యలు వాటిలో వేసి వేయించాలి.

ఇప్పుడు మీరు సిద్ధం చేసి పెట్టుకున్న అన్ని రకాల పేస్టులు దోసకాయ ముక్కల్లో వేసి పసుపు, ఉప్పు చల్లి బాగా కలపాలి. ఆ తర్వాత ఎండు రొయ్యలను వేసి తిప్పాలి. ఇప్పుడు చింతపండు రసం పోసి ఉడికించాలి. అంతే, దోసకాయ, ఎండురొయ్యలు కూర రెడీ.