Kohli-Rohit: బాబర్ ఆజాంకు చెక్ పెట్టనున్న కోహ్లీ-రోహిత్ జోడీ.. అదేంటంటే?

|

Jun 19, 2024 | 3:06 PM

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో సూపర్-8 రౌండ్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో 4 పరుగులు చేస్తే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల పేరిట కొత్త ప్రపంచ రికార్డు క్రియేట్ అవుతుంది. అయితే, ఈ ఇద్దరిలో ఎవరు ఈ వరల్డ్ రికార్డ్ సాధిస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

1 / 5
టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డును లిఖించేందుకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీలో అగ్రస్థానానికి చేరుకోవడానికి ఇద్దరు దిగ్గజాలు కేవలం 4 పరుగులే చేయాల్సి ఉండడం విశేషం.

2 / 5
అంటే, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డ్ పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ పేరిట ఉంది. బాబర్ 116 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 4145 పరుగులు సాధించి ఈ రికార్డు సృష్టించాడు.

3 / 5
ఈ జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. కింగ్ కోహ్లీ ఇప్పటివరకు 112 టీ20 ఇన్నింగ్స్‌లలో 4042 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

4 / 5
టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మూడో స్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు 146 ఇన్నింగ్స్‌లలో 4042 పరుగులు చేశాడు.

5 / 5
అంటే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు ఇక్కడ బాబర్ అజామ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలంటే కేవలం 4 పరుగులు మాత్రమే కావాలి. ఈ నాలుగు పరుగులతో టీ20 క్రికెట్‌లో రన్ లీడర్‌ల జాబితాలో ఎవరు అగ్రస్థానంలో ఉంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.