Unbreakable Records: వన్డే క్రికెట్ హిస్టరీలో ఎప్పటికీ బ్రేక్ చేయలేని 4 రికార్డులు.. లిస్ట్‌లో మనోళ్లవే మూడు..

Updated on: Jan 23, 2026 | 1:29 PM

Top 4 Unbreakable Records in ODI Cricket: క్రికెట్ ప్రపంచంలో రికార్డులు క్రియోట్ అయ్యేది బ్రేక్ అవ్వడానికే అంటుంటారు. కానీ వన్డే అంతర్జాతీయ క్రికెట్ (ODI) హిస్టరీలో కొన్ని రికార్డులు మాత్రం ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ పరుగుల ప్రవాహం నుంచి రోహిత్ శర్మ ‘హిట్‌మ్యాన్’ విధ్వంసం వరకు.. దశాబ్దాలు గడిచినా, తరాలు మారినా చెక్కుచెదరని ఆ నాలుగు అద్భుత రికార్డులు ఏంటో ఓసారి చూద్దాం..

1 / 5
Top 4 Unbreakable Records in ODI Cricket: వన్డే క్రికెట్‌లో దాదాపుగా బ్రేక్ చేయలేని 4 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. ఇప్పటికే క్రికెట్ హిస్టరీలో చాలా మంది దిగ్గజ బ్యాట్స్‌మెన్లతోపాటు బౌలర్లను చూసింది. వీరంతా తమ ప్రతిభతో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అయితే, వన్డే క్రికెట్ హిస్టరీలో ఎన్నో అద్భుతమైన ప్రపంచ రికార్డులు ఉన్నాయి. అయితే, వన్డే క్రికెట్‌లో బ్రేక్ చేయలేని దాదాపు అసాధ్యమైన 4 ప్రపంచ రికార్డులు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

2 / 5
1. వన్డేల్లో సచిన్ 18426 పరుగులు: తన 22 ఏళ్ల, 91 రోజుల వన్డే కెరీర్‌లో, సచిన్ టెండూల్కర్ 463 వన్డేల్లో 452 ఇన్నింగ్స్‌ల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేశాడు. ఈ కాలంలో, టెండూల్కర్ 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతని అత్యుత్తమ వన్డే స్కోరు 200 నాటౌట్. సచిన్ టెండూల్కర్ 18,426 వన్డే పరుగుల ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యం.

3 / 5
2. విరాట్ కోహ్లీ 54 వన్డే సెంచరీలు: భారత అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన విరాట్ కోహ్లీ ఇప్పటివరకు తన వన్డే కెరీర్‌లో 54 సెంచరీలు సాధించాడు. ఈ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 85 సెంచరీలు చేశాడు.

4 / 5
3. 534 వికెట్లతో ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు: శ్రీలంక దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మొత్తం 534 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రపంచ రికార్డును ఏ బౌలర్ కూడా బద్దలు కొట్టడం అసాధ్యం. తన కెరీర్‌లో ముత్తయ్య మురళీధరన్ 133 టెస్టులు, 350 వన్డేలు, 12 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి మొత్తం 1347 వికెట్లు పడగొట్టాడు.

5 / 5
4. వన్డే ఇంటర్నేషనల్స్‌లో 3 డబుల్ సెంచరీల రికార్డు: వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో3 డబుల్ సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డు రోహిత్ శర్మ సొంతం. అతను ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పేరుగాంచాడు. అతను వన్డే క్రికెట్‌లో 3 డబుల్ సెంచరీలు సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఈ ప్రపంచ రికార్డు 100 సంవత్సరాల పాటు బద్దలయ్యే అవకాశం లేదు. రోహిత్ శర్మ గతంలో వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేశాడు. అయితే, ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం లభించిన వెంటనే, అతను అద్భుతంగా రాణించి, వరుసగా పరుగులు సాధించాడు.