
Virat Kohli Neck Injury: ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు విరాట్ కోహ్లీకి సంబంధించి కీలక వార్త బయటకు వచ్చింది. వచ్చే నెలలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. టీమ్ ఇండియా ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఇందుకు కేవలం ఒక నెల మాత్రమే మిగిలి ఉంది. దీనికి ముందు కోహ్లీ విషయంలో టెన్షన్ పెంచే వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ గాయపడ్డాడు. ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతని గాయం గురించిన రహస్యం వెలుగులోకి వచ్చింది.

సిడ్నీలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో కోహ్లి గాయపడ్డాడు. అతను మెడ గాయంతో బాధపడ్డాడు. ఆ తర్వాత టీమిండియా ఫిజియో అతనికి చికిత్స అందించాడు. మెడ గాయం కారణంగా సౌరాష్ట్రతో జరిగే ఢిల్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు కోహ్లి దూరమయ్యే అవకాశం ఉందని, జనవరి 23 నుంచి 26 వరకు సౌరాష్ట్రతో రాజ్‌కోట్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే.

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం సిడ్నీలో కోహ్లి మెడకు గాయం కావడంతో భారత జట్టు ఫిజియో అక్కడ చికిత్స అందించినట్లు తెలుస్తోంది. కోహ్లి మెడ బెణికిందని, ఇందుకోసం ఇంజెక్షన్ తీసుకోవలసి వచ్చిందని, అతను మిగిలిన రెండు రంజీ మ్యాచ్‌ల్లో పాల్గొనలేదు. మొదటి మ్యాచ్‌లో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆడలేడు అని తెలుస్తోంది. సెలెక్టర్‌లకు ఈ మేరకు అప్‌డేట్ ఇవ్వనున్నట్లు భావిస్తున్నారు.

అయితే, మెడకు గాయం కావడంపై కోహ్లీ వైపు నుంచి ఎలాంటి సమాచారం లేదని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధికారి స్పోర్ట్స్ టాక్‌కి తెలిపారు. సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి వచ్చిన కోహ్లి ముంబైలో తన కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నాడు.

విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడి దశాబ్దానికి పైగా గడిచింది. అతను చివరిసారిగా 2012లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియా టూర్‌లో పేలవమైన ఫామ్‌తో కోహ్లీ పలు విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది. దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు సలహాలు తీసుకోవడం ప్రారంభించాడు. కాగా, కాంట్రాక్ట్ ఆటగాళ్లు తమ ఖాళీ సమయంలో దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధనను బీసీసీఐ అమలు చేసింది. అంతకుముందు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా దేశవాళీ క్రికెట్ గురించి మాట్లాడాడు, ఆ తర్వాత కోహ్లి కూడా దేశవాళీ క్రికెట్ ఆడటం గురించి చర్చ మొదలైంది.