ICC Test Rankings: టీమిండియా సెంచరీ ప్లేయర్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. ఎందుకంటే?

|

Dec 04, 2024 | 6:12 PM

ICC Test Rankings: పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సెంచరీతో టెస్ట్ బ్యాట్స్‌మెన్స్ ర్యాంకింగ్స్‌లో 2వ స్థానానికి ఎగబాకిన యశస్వి జైస్వాల్ కేవలం ఒక వారంలోనే ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానానికి పడిపోయాడు. హ్యారీ బ్రూక్ మంచి ఆటతీరుతో జైస్వాల్ తన స్థానాన్ని కోల్పోయాడు. అయితే, బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మాత్రం తన విజయాన్ని కొనసాగిస్తున్న జస్ప్రీత్ బుమ్రా మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

ICC Test Rankings: టీమిండియా సెంచరీ ప్లేయర్‌కు బిగ్ షాకిచ్చిన ఐసీసీ.. ఎందుకంటే?
ICC Test Rankings: పెర్త్ మైదానంలో ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ సెంచరీ సాధించి, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారీ ప్రమోషన్‌ను అందుకున్న భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. గత వారమే బ్యాట్స్‌మెన్స్ ర్యాంకింగ్ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. కాగా, జైస్వాల్ వారం రోజుల్లోనే ఆ స్థానాన్ని కోల్పోవడం విశేషం.
Follow us on