SRH vs MI, IPL 2024: ఉప్పల్‌లో బోణీ కొట్టిన హైదరాబాద్.. 31 రన్స్ తేడాతో ముంబైపై ఘన విజయం

|

Mar 27, 2024 | 11:36 PM

సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. బుధవారం (మార్చి 27) రాత్రి ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌ లో 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను మట్టికరిపించింది. తద్వారా ఈ సీజన్ లో మొదటి విజయాన్ని చవి చూసింది.

1 / 5

2 / 5
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ భారీ స్కోరు చేసింది.  క్లాసెన్‌ (80నాటౌట్), అభిషేక్‌ (63), హెడ్‌ (62), మార్‌క్రమ్‌ (42 నాటౌట్) చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

3 / 5
ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోరును ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కూడా ధాటిగానే ఆడింది. ముఖ్యంగా తెలుగబ్బాయి తిలక్ వర్మ ( 34 బంతుల్లో 64) చెలరేగాడు

4 / 5
టిమ్ డేవిడ్ (42), ఇషాన్ కిషన్ (34), రోహిత్ శర్మ (26) వేగంగా పరుగులు చేసినా లక్ష్యం మరీ పెద్దదైపోయింది. దీంతో ముంబైకు ఓటమి తప్పలేదు.

5 / 5
హైదరాబాద్‌ బౌలర్లలో కెప్టెన్ కమిన్స్‌,జయదేవ్ ఉనద్కత్‌ తలో రెండు వికెట్లు తీశారు. కాగా ఈ సీజన్ లో ముంబైకు వరుసగా ఇది రెండో ఓటమి కావడం గమనార్హం.