- Telugu News Photo Gallery Cricket photos Sunrisers Hyderabad All Rounder Wanindu Hasaranga Ruled Out from IPL 2024
IPL 2024: హైదరాబాద్ జట్టుకు భారీ షాక్.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న స్టార్ ఆల్ రౌండర్..
Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 23వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. ఈ ఐపీఎల్ వేలం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వనిందు హస్రంగను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతను ఔట్ కావడంతో SRH జట్టు మరో విదేశీ ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
Updated on: Apr 08, 2024 | 1:34 PM

Wanindu Hasaranga Ruled Out: ఈసారి ఐపీఎల్ (IPL 2024)లో అద్భుత ప్రదర్శన చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్ 17 నుంచి ఆ జట్టు అగ్రశ్రేణి ఆల్‌రౌండర్ వనిందు హసరంగా నిష్క్రమించాడు.

మడమ నొప్పితో బాధపడుతున్న హసరంగ ఈ ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇప్పుడు గాయం కారణంగా మొత్తం టోర్నీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తదుపరి మ్యాచ్‌లలో వానిందు హస్రంగ కనిపించడు.

ఈ ఐపీఎల్ వేలం ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ వనిందు హస్రంగను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతను ఔట్ కావడంతో SRH జట్టు మరో విదేశీ ఆటగాడిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 మ్యాచ్‌లు గెలిచింది. SRH ఓడిపోయిన రెండు మ్యాచ్‌ల్లోనూ మంచి ప్రదర్శన చేసింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో కొనసాగుతోంది.

SRH తమ తదుపరి మ్యాచ్‌ని ఏప్రిల్ 9న ఆడనుంది. మహారాజా యద్వీంద్ర సింగ్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.




