
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. కొన్ని జట్లు ఇప్పటికే ప్లేఆఫ్ దిశగా అడుగులు వేశాయి. కొన్ని జట్లు ఔట్ కావడం ఖాయం. అయితే ఈ సీజన్ లో కొతమంది ఆటగాళ్లకు ప్లేయింగ్ XIలో ఆడే అవకాశం ఇప్పటివరకు రాలేదు. ఆ ఐదుగురు దురదృష్టకర ఆటగాళ్లవరో తెలుసుకుందాం రండి.

విండీస్ స్టార్ బ్యాటర్ కైల్ మేయర్స్ లక్నో సూపర్ జెయింట్‌లో చేరాడు. ఈ సీజన్‌లో మేయర్స్‌కు ఒక్క అవకాశం కూడా రాలేదు. గత సీజన్‌లో మేయర్స్ 13 మ్యాచ్‌ల్లో 379 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నాడు. గత సీజన్‌లో గ్లెన్‌కు హైదరాబాద్ తరఫున 5 మ్యాచ్‌లు ఆడి అద్భుతంగా రాణించాడు.

న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్నాడు. మిచెల్‌ను ఇంకా ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చలేదు. మిచెల్ గత సీజన్‌లో కొన్ని మ్యాచ్ లు ఆడాడు.

నవదీప్ సైనీ ప్రస్తుతం రాజస్థాన్ జట్టులో ఉన్నాడు. కానీ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. అలాగే ఆఫ్ఘనిస్థాన్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ గత సీజన్‌లో KKR కోసం ఓపెనింగ్ చేశాడు. కానీ ఈ ఏడాది మాత్రం రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు.