
సారాకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్.. వైరలవుతోన్న ఫొటోలు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూనే ఉంది. తాజాగా మరో 2 ఫోటోలను షేర్ చేసింది.

రక్షా బంధన్ సందర్భంగా అర్జున్ టెండూల్కర్ సారాకు అదిరిపోయే బహుమతి ఇచ్చాడు. ఆ విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సారా.

సోదరుడు ఇచ్చిన బ్యాగ్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంటూ.. ' రాఖీ పండగకు ముందే మంచి బహుమతి ఇచ్చిన నా సోదరుడు అర్జున్ టెండూల్కర్‌కి ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది.

24 ఏళ్ల సారా తన ప్రయాణాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంంటుంది.

కాగా సారా త్వరలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.