IPL 2024: ‘బెంగ’ళూరులో విజయం అంత ఈజీ కాదు.. లెక్కలు చూస్తే ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు కన్నీళ్లే..

|

Mar 25, 2024 | 5:13 PM

IPL 2024 RCB vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 6వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 2024లో విజయాల ఖాతా తెరవాలని ఆర్‌సీబీ లక్ష్యంగా పెట్టుకుంది.

1 / 8
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 ప్రారంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఇప్పుడు 2వ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు (మార్చి 25) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టు పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది.

2 / 8
సొంత మైదానంలో మ్యాచ్ జరగడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్లస్ పాయింట్ అవుతుందా? అన్న ప్రశ్నకు సమాధానం క్లియర్‌గా లేదు. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలిచిన దానికంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

3 / 8
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటి వరకు 84 మ్యాచ్‌లు ఆడింది. కేవలం 39 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మిగతా 40 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. అలాగే 4 మ్యాచ్‌ల్లో రిజల్ట్ రాలేదు.

4 / 8
అంటే RCB జట్టు హోమ్ గ్రౌండ్‌లో ప్రత్యర్థుల జట్లు 50 శాతం విజయాల సగటును కలిగి ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ జట్టు ఈ లిస్టులో టాప్‌లోనే ఉంది. అందుకే పంజాబ్ కింగ్స్‌పై గెలవడం బెంగళూరు జట్టుకు ఈజీ కాదని తెలుస్తోంది.

5 / 8
పంజాబ్‌లో సామ్ కరణ్, లియామ్ లివింగ్‌స్టోన్, సికందర్ రజా వంటి స్టార్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. ఈ ఆటగాళ్లు ఏ దశలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. అందుకే చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ జట్టు సత్తా చాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

6 / 8
ఇప్పటి వరకు చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు 11 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఆర్సీబీ 6 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. కాబట్టి నేటి మ్యాచ్‌లోనూ పంజాబ్‌ జట్టు నుంచి హోరాహోరీ పోటీని ఆశించవచ్చు.

7 / 8
పంజాబ్ కింగ్స్ స్క్వాడ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడే, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కరణ్, కగిసో రబాడ, హర్‌ప్రీత్ బ్రర్, రాహుల్ చాహర్, రాహుల్ చాహర్ భాటియా, విద్వాత్ కవీరప్ప, శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్, రిలే రోసో.

8 / 8
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: ఫాఫ్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లొమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, మోహమ్ దీప్ , మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కరణ్, లక్కీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.