Rohit Sharma: ఏంటి రోహిత్ భయ్యా.. అందుకోసం వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనా.. ఎంత కష్టమొచ్చే

|

Aug 11, 2024 | 4:19 PM

Rohit Sharma Records: వన్డే క్రికెట్‌లో సిక్సర్ కింగ్‌గా అవతరించేందుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కేవలం 22 సిక్సర్లు మాత్రమే కావాలి. ఇప్పటికే 331 సిక్సర్లు బాదిన ఈ హిట్ మ్యాన్.. త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించేందుకు ఎదురుచూస్తున్నాడు.

1 / 6
శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఇప్పుడు ప్రపంచ రికార్డు అంచున నిలిచాడు. అయితే, హిట్‌మ్యాన్ ఈ ప్రపంచ రికార్డు సృష్టించాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.

2 / 6
అంటే, వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో హిట్‌మన్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. అది కూడా క్రిస్ గేల్ పేరిట ఉన్న సిక్సర్ల రికార్డును సమం చేయడం. గేల్‌ను అధిగమించేందుకు రోహిత్ శర్మకు ఇప్పుడు ఒకే ఒక సిక్సర్ అవసరం.

3 / 6
ఈ ఒక్క సిక్సర్ కొట్టాలంటే రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్ వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే, ఈ ఏడాది భారత్‌కు వన్డే సిరీస్‌లు లేవు. తద్వారా 2025లో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్ ద్వారా మాత్రమే హిట్‌మ్యాన్ సిక్స్ లీడర్‌బోర్డ్‌లో పైకి చేరుకుంటాడు.

4 / 6
వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు పాకిస్థాన్ మాజీ పేసర్ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. 369 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన ఆఫ్రిది మొత్తం 351 సిక్సర్లు కొట్టి ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

5 / 6
ఈ జాబితాలో క్రిస్ గేల్ రెండో స్థానంలో ఉన్నాడు. గేల్ 294 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 331 సిక్సర్లు బాదాడు. దీంతో వన్డే క్రికెట్‌లో 2వ సిక్సర్‌ కింగ్స్‌గా అవతరించాడు.

6 / 6
ఇప్పుడు క్రిస్ గేల్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. 257 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ హిట్‌మ్యాన్ మొత్తం 331 సిక్సర్లు కొట్టాడు. మరో సిక్స్ కొడితే రోహిత్ శర్మ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి సిక్సర్ల జాబితాలో రెండో స్థానంలో నిలుస్తాడు.