ICC Rankings: ఒక్క మ్యాచ్ కూడా ఆడలే.. కట్‌చేస్తే.. బాబర్ ఆజాంను అధిగమించిన కింగ్ కోహ్లీ

Updated on: Nov 12, 2025 | 8:30 PM

Latest ICC ODI Rankings: ఐసీసీ కొత్త వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. రోహిత్ శర్మ తన నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ముఖ్యంగా, విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోయినా ఐదవ స్థానానికి ఎగబాకాడు. బాబర్ ఆజామ్ పేలవమైన ఫామ్ కారణంగా పడిపోయాడు. బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ ర్యాంకింగ్స్‌లో చాలా ఆశ్చర్యకరమైన మార్పులు జరిగాయి.

1 / 6
Latest ICC ODI Rankings: ఐసీసీ కొత్త వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ జాబితాలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు ఉన్నాయి. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 781 పాయింట్లతో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, పాకిస్తాన్ వెటరన్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ తన పేలవమైన ఫామ్ కారణంగా దిగజారాడు. అయితే, ఒక్క మ్యాచ్ కూడా ఆడని విరాట్ కోహ్లీ పైకి ఎగబాకాడు.

2 / 6
 తాజా వన్డే ర్యాంకింగ్స్ లో రోహిత్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కు చెందన ఇబ్రహీం జద్రాన్ 764 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండకు చెందిన డారిల్ మిచెల్ 746 పాయింట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు. భారత వన్డే జట్టు ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్ 745 పాయింట్లతో నాల్గవ స్థానంలో ఉన్నాడు.

3 / 6
ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లీ ఇప్పుడు 725 పాయింట్లతో ఐదవ స్థానానికి చేరుకున్నాడు. ముఖ్యంగా, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ తర్వాత, అతను ఏ వన్డేలు ఆడలేదు. అతని పాయింట్లు కూడా మారలేదు. అయితే, గత ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న కోహ్లీ ఇప్పుడు ఐదవ స్థానానికి చేరుకున్నాడు.

4 / 6
నిజానికి, పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న బాబర్ ఆజం వన్డే ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారాడు. 709 రేటింగ్ పాయింట్లతో, బాబర్ ఇప్పుడు ఐదవ స్థానం నుంచి ఏడవ స్థానానికి పడిపోయాడు. అంటే విరాట్‌తో పాటు, శ్రీలంకకు చెందిన చరిత్ అసలంక కూడా ఒక స్థానం ఎగబాకి ఏడవ స్థానం నుంచి ఆరవ స్థానానికి చేరుకున్నాడు.

5 / 6
బౌలర్ల వన్డే ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా, దక్షిణాఫ్రికాకు చెందిన కేశవ్ మహారాజ్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రెండు స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు.

6 / 6
టీం ఇండియా గూగ్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఏడో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం టాప్ 10లో ఉన్న ఏకైక భారత బౌలర్ కుల్దీప్ యాదవ్. అతని తర్వాత రవీంద్ర జడేజా 13వ స్థానంలో, మహమ్మద్ సిరాజ్ 16వ స్థానంలో ఉన్నారు.