
Rohit Sharma: గురువారం దుబాయ్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మ్యాచ్‌లో రోహిత్ శర్మ 11,000 వన్డే ఇంటర్నేషనల్ పరుగులు దాటిన నాల్గవ భారత బ్యాట్స్‌మన్‌గా, అన్ని జట్లలో 10వ ఆటగాడిగా నిలిచాడు.

ఈ క్రమంలో భారత కెప్టెన్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీల సరసన 11,000 పరుగుల క్లబ్‌లో చేరాడు.

రోహిత్ తన 261వ ఇన్నింగ్స్‌లో 11,000 పరుగుల మైలురాయిని చేరుకున్న రెండవ వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. 222 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించిన కోహ్లీ తర్వాత, వన్డేల్లో తన 261వ ఇన్నింగ్స్‌లో 11,000 పరుగుల మార్కును చేరుకున్నాడు.

సచిన్ టెండూల్కర్ 452 ఇన్నింగ్స్‌లలో 18,000 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర 14,234 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు.

వన్డేల్లో టాప్ 10 పరుగులు సాధించిన ఆటగాళ్లలో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ , సౌరవ్ గంగూలీ కూడా ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో 14,000 పరుగులకు చేరువలో ఉన్న భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ.