Sanju Samson: వరుస వైఫల్యాలతో సంజూ శాంసన్‌కు బిగ్ షాక్.. స్వ్కాడ్‌ నుంచి ఔట్

|

Oct 11, 2024 | 7:14 AM

Sanju Samson: రంజీ ట్రోఫీలో తొలి రెండు మ్యాచ్‌లకు కేరళ జట్టును ప్రకటించారు. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌ను జట్టులోకి ఎంపిక చేయలేదు. అక్టోబర్ 11న పంజాబ్‌తో కేరళ తొలి మ్యాచ్ ఆడనుంది. తొలి రెండు మ్యాచ్‌లకు సచిన్ బేబీ కేరళ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

1 / 5
ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజు శాంసన్ కూడా జట్టులోకి వచ్చాడు. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో సంజూ ఆటతీరు బాగాలేదు. రెండో మ్యాచ్‌లో సంజూ తొందరగానే ఔట్ అయ్యి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాడు.

2 / 5
తొలి టీ20 మ్యాచ్‌లో 19 బంతుల్లో 6 బౌండరీలతో 29 పరుగులు చేసిన సంజూ.. స్లో బాల్‌కు బలి అయ్యాడు. ఇప్పుడు రెండో టీ20 మ్యాచ్‌లోనూ 7 బంతుల్లో 2 బౌండరీలతో 10 పరుగులు చేసిన సంజూ.. స్లో బాల్‌కు మరోసారి తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. అప్పటి నుంచి సంజూ తన పేలవ ప్రదర్శనతో పలు విమర్శలకు గురయ్యాడు.

3 / 5
ఫలితంగా, రంజీ ట్రోఫీ దేశవాళీ టోర్నమెంట్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు సంజూ జట్టు నుంచి తొలగించారు. ఈ రంజీ ట్రోఫీ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి అన్ని స్క్వాడ్‌లను ప్రకటిస్తున్నారు. తదనుగుణంగా కేరళ జట్టును కూడా ప్రకటించారు.

4 / 5
టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు కేరళ జట్టును ప్రకటించారు. వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌ను జట్టులోకి ఎంపిక చేయలేదు. అక్టోబర్ 11న పంజాబ్‌తో కేరళ తొలి మ్యాచ్ ఆడనుంది. తొలి రెండు మ్యాచ్‌లకు సచిన్ బేబీ కేరళ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

5 / 5
కేరళ జట్టు: సచిన్ బేబీ (కెప్టెన్), రోహన్ ఎస్ కున్నుమల్, కృష్ణ ప్రసాద్, బాబా అపరాజిత్, అక్షయ్ చంద్రన్, మహ్మద్ అజారుద్దీన్, సల్మాన్ నిజార్, వత్సల్ గోవింద్, విష్ణు వినోద్, జలజ్ సక్సేనా, ఎ ఆనంద్ సర్వతే, బాసిల్ తంపి, నిధీష్ ఎండి, ఆసిఫ్ కెఎమ్, ఫాజిల్ ఫానూస్.