- Telugu News Photo Gallery Cricket photos Punjab kings fail but preity zinta another team Saint Lucia Kings team Champions in CPL 2024
తొలి ట్రోఫీ ముద్దాడిన ప్రీతిజింటా.. ఎన్నో ఏళ్ల కల నెరవేర్చిన కోహ్లీ దోస్త్..
Saint Lucia Kings: కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2024)లో సెయింట్ లూసియా కింగ్స్ విజయం సాధించింది. అది ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోనే కావడం విశేషం. దీంతో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తొలి ట్రోఫీని కైవసం చేసుకుని, ట్రోఫీ కరవుకు ముగింపు పలికింది.
Updated on: Oct 07, 2024 | 3:57 PM

CPL 2024: ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ట్రోఫీని గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ముఖ్యంగా రెండు జట్ల కింగ్స్ ఫ్రాంచైజీకి ట్రోపీ ఎండమావిగా మారింది. కానీ, ఈసారి పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తొలి ట్రోఫీని కైవసం చేసుకోవడంలో సఫలమైంది.

కరీబియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి చెందిన సెయింట్ లూసియా కింగ్స్ ఛాంపియన్‌గా నిలిచింది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్ తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన గయానా అమెజాన్ వారియర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (0) ఔట్ కాగా, మొయిన్ అలీ 14 పరుగులు చేశాడు.

ఆ తర్వాత షాయ్ హోప్ 22 పరుగులు చేయగా, రొమారియో షెపర్డ్ 19 పరుగులు చేశాడు. 9వ స్థానంలో వచ్చిన డ్వేన్ ప్రిటోరియస్ అత్యధిక స్కోరు 25 పరుగులు చేశాడు. దీంతో గయానా అమెజాన్ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది.

139 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన సెయింట్ లూసియా కింగ్స్ జట్టుకు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (21) శుభారంభం అందించాడు. అయితే మిగతా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ నుంచి ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ రాలేదు. ఫలితంగా 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ దశలో జోడీ కట్టిన రోస్టన్ చేజ్, ఆరోన్ జోన్స్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 22 బంతులు ఎదుర్కొన్న రోస్టన్ 2 సిక్సర్లు, 2 ఫోర్లతో అజేయంగా 39 పరుగులు చేయగా, జోన్స్ 31 బంతుల్లో 4 భారీ సిక్సర్లతో అజేయంగా 48 పరుగులు చేశాడు. దీంతో జట్టు లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది.

దీని ద్వారా కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో పాటు 17 ఏళ్లుగా ట్రోఫీ నెగ్గలేదన్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కోరిక కూడా నెరవేరింది.




