
India vs Pakistan: ఆసియా కప్ 2025లో టీమిండియా పాకిస్థాన్‌ను ఓడించడమే కాకుండా, వారిని బహిరంగంగా అవమానించింది. పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించడం ద్వారా టీమిండియా తగిన శాస్తి చేసింది. టాస్ సమయంలో, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇలాగే చేశాడు. ఆ తర్వాత, మ్యాచ్ గెలిచినప్పుడు కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టును పట్టించుకోలేదు. భారత జట్టులోని ఏ ఒక్క సభ్యుడు కూడా వారితో కరచాలనం చేయలేదు. పాక్ ఆటగాళ్లు స్వయంగా వారితో కరచాలనం చేయడానికి అసహనంతో కనిపించారు. ఇప్పుడు భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడంపై దుమారం చెలరేగుతోంది. ఈ విషయంలో పాక్ క్రికెట్ జట్టు కూడా టీమిండియాపై చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

భారత జట్టు కరచాలనం చేయకపోవడంతో కలత చెందిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మేనేజర్, పీసీబీ ఆదేశం మేరకు భారత జట్టుపై ఫిర్యాదు చేశారు. పీటీఐ ప్రకారం, జట్టు మేనేజర్ నవీద్ అక్తర్ చీమా టీమిండియా అనుచిత ప్రవర్తనకు సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ముందు తమ గోడు వెల్లబోసుకున్నాడు.

అంతకుముందు, సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ పై తన విజయాన్ని పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన అమాయక ప్రజలకు అంకితం చేశాడు. పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయవద్దని భారత జట్టు ఉన్నతాధికారులు కఠినంగా ఆదేశించారని సమాచారం. జట్టులోని ఆటగాళ్లందరూ కూడా అదే పాటించారు. అందిన సమాచారం ప్రకారం, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు దీని గురించి అరగంట సమావేశం కూడా జరిగింది.

పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లు కూడా భారత ఆటగాళ్లతో కరచాలనం చేయకపోవడం పట్ల చాలా కలత చెందుతున్నారు. వారు టీమిండియా వైఖరితో సంతోషంగా లేరు. ఇది కేవలం ఆసియా కప్ మాత్రమేనని, ఐసీసీ టోర్నమెంట్లలో కూడా అదే జరగవచ్చని బాసిత్ అలీ అన్నారు. పాకిస్తాన్ టీవీ షోలో బాసిత్ అలీతో కలిసి కూర్చున్నప్పుడు కమ్రాన్ అక్మల్ కూడా టీమిండియా వైఖరిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇది క్రికెట్ అభివృద్ధికి మంచిది కాదని ఆయన అన్నారు.

భారత జట్టు చర్యపై పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ రషీద్ లతీఫ్ మాట్లాడుతూ, ఇలా చేయడం ద్వారా వారు తమ నిజస్వరూపాన్ని చూపించిందని' తెలిపాడు. ఈ మొత్తం విషయంపై ఐసీసీని ఇరుకున పెట్టాడు. ఐసీసీ ఎక్కడ అంటూ ప్రశ్నించాడు.

భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడం వల్ల తమకు తగిన సమాధానం లభించిందని పాకిస్తాన్ నిరాశ చెందిందని స్పష్టంగా తెలుస్తుంది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా నిరాశతో మ్యాచ్ తర్వాత పోస్ట్ ప్రజెంటేషన్ కు హాజరు కాలేదు. పాకిస్తాన్ జట్టు కోచ్ కూడా దీని గురించి చెడుగా భావించాడు. కానీ, పహల్గామ్‌లో ఏం జరిగిందో వాళ్లు మర్చిపోయినట్లున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.