600 Test Wickets: టెస్టుల్లో 600 వికెట్లు తీసిన ఐదుగురు బౌలర్లు.. లిస్టులో భారత్ నుంచి ‘మాజీ కెప్టెన్’ మాత్రమే..

|

Jul 21, 2023 | 6:40 AM

Test Records: టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఐదుగురు బౌలర్లు మాత్రమే 600 వికెట్ల మార్క్‌ని దాటగలిగారు. ఈ ఐదుగురిలో ముగ్గురు స్పిన్నర్లు కాగా, మిగిలిన ఇద్దరూ ఇంగ్లాండ్‌కి చెందిన పేసర్లు. అసలు ఇంతకీ టెస్టు క్రికెట్‌లో 6 వందలకు పైగా వికెట్లు తీసిన బౌలర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

1 / 5
1. ముత్తయ్య మురళీధరన్: శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రికార్డ్‌ని కలిగి ఉన్నాడు. మొత్తం 133 టెస్టులు ఆడిన మురళీధరణ్ ఏకంగా 800 వికెట్లను పడగొట్టాడు.

2 / 5
2. షేన్ వార్న్: ఆస్ట్రేలియా స్పిన్ ఛామర్ షేన్ వార్న్ అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. షేన్ వార్న్ 145 టెస్టుల్లో మొత్తం 708 వికెట్లను తీసుకున్నాడు.

3 / 5
3. జేమ్స్ అండర్సన్: టెస్టు క్రికెట్ చరిత్రలో 600 వికెట్లు తీసిన తొలి పేసర్‌గా ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ నిలిచాడు. అలాగే అత్యధిక వికెట్లు తీసిన మూడో టెస్ట్ బౌలర్‌గా ఉన్న అండర్సన్ ఇప్పటివరకు 182 టెస్టుల్లో ఆడి 688 వికెట్లు తీశాడు.

4 / 5
4. అనిల్ కుంబ్లే: భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన అనిల్ కుంబ్లే ఈ లిస్టు నాల్గో స్థానంలో ఉన్నాడు. మొత్తం 132 టెస్టులు ఆడిన ఈ భారత మాజీ కెప్టెన్ 619 వికెట్లు పడగొట్టాడు.

5 / 5
5. స్టువర్ట్ బ్రాడ్: మంచెస్టర్ వేదికగా జరుగుతున్న యాషెస్ సిరీస్ 2023 మూడో టెస్ట్ ఆడుతున్న స్టువర్ట్ బ్రాడ్ తాజాగా 600వ వికెట్ తీసుకుని ఈ లిస్టులో స్థానం పొందాడు. ఇప్పటివరకు 166 టెస్టులు ఆడిన బ్రాడ్ 600 వికెట్లను తీసుకోవడంతో పాటు ఆ ఘనత సాధించిన రెండో ఇంగ్లాండ్ బౌలర్‌గా, రెండో అంతర్జాతీయ పేసర్‌గా నిలిచాడు.