IPL 2024: గుజరాత్‌పై గర్జించిన లక్నో కెప్టెన్.. స్పెషల్ రికార్డులో చేరిన కేఎల్ రాహుల్..!

KL Rahul Records in IPL: టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. జట్టు తరుపున స్టోయినిస్ అర్ధ సెంచరీతో రాణించగా, కెప్టెన్‌గా ఆడిన రాహుల్ 33 పరుగులు చేశాడు. దీని ద్వారా రాహుల్ లక్నోకు అరుదైన రికార్డు కూడా సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌పై రాహుల్ 31 బంతుల్లో 3 బౌండరీలతో 33 పరుగులు చేశాడు. దీంతో లక్నో సూపర్‌జెయింట్స్‌ తరపున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

Venkata Chari

|

Updated on: Apr 09, 2024 | 9:46 AM

Lucknow Super Giants: లక్నోలోని ఎక్నా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్‌జెయింట్స్ వరుసగా మూడో లీగ్ విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి ఎగబాకింది.

1 / 6
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. లక్నో జట్టు తరుపున స్టోయినిస్‌ అర్ధసెంచరీతో రాణించగా, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రాహుల్‌ 33 పరుగులతో రాణించాడు. దీని ద్వారా లక్నోకు అరుదైన రికార్డు కూడా సృష్టించాడు.

2 / 6
గుజరాత్ టైటాన్స్‌పై రాహుల్ 31 బంతుల్లో 3 బౌండరీలతో 33 పరుగులు చేశాడు. దీంతో లక్నో సూపర్‌జెయింట్స్‌ తరపున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

3 / 6
ఈ మ్యాచ్‌కు ముందు లక్నో తరుపున రాహుల్ 983 పరుగులు చేయగా.. 1000 పరుగుల మార్కును చేరుకోవడానికి రాహుల్ 17 పరుగులు చేయాల్సి ఉంది. గుజరాత్‌పై 17వ పరుగు చేసిన వెంటనే రాహుల్ 1000 పరుగుల మార్క్‌ను అధిగమించాడు.

4 / 6
రాహుల్ ఇప్పటి వరకు లక్నో సూపర్‌జెయింట్స్ తరపున 28 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 28 మ్యాచ్‌ల్లో 42.33 సగటుతో 1016 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి.

5 / 6
కాగా, ఐపీఎల్ సీజన్ 17లో ఇప్పటివరకు కేఎల్ రాహుల్ 31.5 సగటుతో 126 పరుగులు చేశాడు. ఇందులో 1 హాఫ్ సెంచరీ ఉంది.

6 / 6
Follow us