
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 52వ మ్యాచ్‌లో ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 147 పరుగులకు ఆలౌటైంది.

పైన చెప్పుకున్నట్టుగానే ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు.. ఆర్‌సీబీ పేసర్ల ధాటికి తడబడింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, వృద్ధిమాన్ సాహా సింగిల్ డిజిట్‌కే అలసిపోయారు.

ఎప్పటిలాగే సాహా కేవలం 1 పరుగుకే సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా 2 పరుగులకే ఇన్నింగ్స్ ముగించాడు.

మూడో స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ కూడా 6 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ జట్టు 5.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 19 పరుగులు మాత్రమే చేసింది.

తొలి షాక్ నుంచి తేరుకోని గుజరాత్ జట్టు తొలి 6 ఓవర్లు అంటే పవర్‌ప్లే ముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 23 పరుగులు మాత్రమే చేసింది. దీంతో పాటు ఈ ఎడిషన్‌లో పవర్‌ప్లేలో అత్యల్ప పరుగులు చేసిన జట్టుగా గుజరాత్ రికార్డు సృష్టించింది.

ఇలా మొత్తం ఎడిషన్‌లో చాలా సులువుగా పరుగులు ఇచ్చి ఎన్నో అవాంఛనీయ రికార్డులు సృష్టించిన ఆర్సీబీ పేసర్లు.. పవర్‌ప్లేలో గుజరాత్ జట్టుకు కేవలం 23 పరుగులే ఇచ్చి పవర్‌ప్లేలో అతి తక్కువ పరుగులు ఇచ్చిన జట్టుగా రికార్డు సృష్టించారు.