Basha Shek |
Apr 06, 2024 | 10:45 PM
శనివారం (ఏప్రిల్ 06) RCBతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఆటగాళ్లు తమ బ్లూ-పింక్ జెర్సీకి బదులుగా ఆల్-పింక్ జెర్సీలో మైదానంలోకి వచ్చారు. దీనికొక ప్రత్యేక కారణం ఉంది. అదేంటంటే.. నిజానికి ఈ మ్యాచ్ పూర్తిగా మహిళల కోసం ఆడనుంది రాజస్థాన్.
మహిళల గౌరవార్థం ఈ మ్యాచ్‌కు ప్రత్యేక పేరు కూడా పెట్టారు. అదే 'పింక్ ప్రామిస్'. గ్రామీణ రాజస్థాన్‌లో సామాజిక మార్పును నడిపించే మహిళలకు మద్దతు ఇవ్వడం RR లక్ష్యం అని ఫ్రాంచైజీ తెలిపింది
జైపూర్ నగరాన్నే పింక్ సిటీగా పిలుస్తారని చెప్పాలి. రాజస్థాన్ జట్టు జెర్సీ కూడా గులాబీ రంగులోనే ఉంటుంది. అయితే శనివారం జైపూర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కోసం మాత్రం పూర్తిగా పింక్ జెర్సీతో బరిలోకి దిగారు.
ఈ జెర్సీపై కొంతమంది మహిళల పేర్లు ముద్రించి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విక్రయించే ప్రతి టిక్కెట్టు నుంచి రూ.100 మహిళల అభివృద్ధికి విరాళంగా ఇవ్వనున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ మ్యాచ్‌లో ప్రతి సిక్స్‌కి రాజస్థాన్‌లోని ఆరు ఇళ్లకు సౌరశక్తిని అందించనున్నారు.
ఈ మ్యాచ్ మొదటి టిక్కెట్ 'రాయల్ పింక్ పాస్' ఈ మహిళలకు కేటాయించారు. రాజస్థాన్ కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ మహిళల కోసం ఈ పింక్ పాస్‌లను అందుబాటులోకి తెచ్చారు.