
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 39వ మ్యాచ్‌లో మార్కస్ స్టోయినిస్ తుఫాన్ సెంచరీ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ తరపున రుతురాజ్ గైక్వాడ్ (108) సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ సెంచరీ సాయంతో సీఎస్‌కే జట్టు 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.

ఈ లక్ష్యాన్ని ఛేదించిన లక్నో సూపర్ జెయింట్స్ తరపున మార్కస్ స్టోయినిస్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన స్టోయినిస్ (124) అజేయ శతకం సాధించి లక్నో సూపర్‌జెయింట్స్ జట్టుకు విజయాన్ని అందించాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మార్కస్ స్టోయినిస్ 124 పరుగులతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంటే ఐపీఎల్‌లో ఛేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా స్టోయినిస్ రికార్డు సృష్టించాడు.

గతంలో ఈ రికార్డు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. 2011లో CSKపై పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన పాల్ వాల్తాటి 63 బంతుల్లో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇప్పుడు ఈ రికార్డును స్టోయినిస్ చెరిపేశాడు.

చెన్నై సూపర్ కింగ్స్‌పై 63 బంతులు ఎదుర్కొన్న మార్కస్ స్టోయినిస్ 6 భారీ సిక్సర్లు, 13 ఫోర్లతో అజేయంగా 124 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల యంత్రంగా నిలిచాడు. దీంతో గత 13 ఏళ్ల రికార్డును చెరిపేయడంలో స్టోయినిస్ సఫలమయ్యాడు.