IPL 2023: అండర్-16 ఆటగాళ్లకు దినేష్ కార్తీక్ సలహాలు.. ఒక్కసారిగా వెల్లువెత్తిన ట్రోల్స్.. ఎందుకంటే..?

|

Apr 29, 2023 | 7:50 PM

ఐపీఎల్ సీజన్‌లో దినేష్ కార్తీక్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. 8 మ్యాచ్‌లు ఆడిన డీకే 83 పరుగులు మాత్రమే చేశాడు. అంటే ఆ జట్టుకి ఫినిషర్‌గా ఉన్న కార్తీక్ తన బ్యాటింగ్‌లో 11.86 పరుగులు మాత్రమే..

1 / 6
IPL 2023: బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జరిగిన అండర్-16 ఆటగాళ్ల ప్రత్యేక శిబిరంలో రాయల్ చాలెంజర్స్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మ్యాన్ దినేష్ కార్తీక్ కనిపించాడు. ఈ అండర్-16 శిబిరంలో పాల్గొన్న దినేష్ కార్తీక్ యువ  క్రికెటర్లతో ముచ్చటించాడు. అతను వారికి తమ కలలను వెంబడించడానికి అవసరమైన విలువైన సలహాలను, ఇంకా తన జీవితంలోని పాఠాలను కూడా వివరించాడు.

2 / 6
ఈ స్పెషల్ ఇంటరాక్షన్‌కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్న క్రమంలో డీకే ట్రోల్ కూడా కావ‌డం విశేషం.

3 / 6
ఎందుకంటే ఈ ఐపీఎల్‌లో దినేష్ కార్తీక్ పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. 8 మ్యాచ్‌లు ఆడిన డీకే 83 పరుగులు మాత్రమే చేశాడు. అంటే ఆ జట్టుకి ఫినిషర్‌గా ఉన్న కార్తీక్ తన బ్యాటింగ్‌లో 11.86 పరుగులు మాత్రమే చేశాడు.

4 / 6
దినేష్ కార్తీక్ లాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు మిడిలార్డర్‌లో విఫలమవడమే ఆర్సీబీ జట్టు ఓటమికి ప్రధాన కారణమని నెటిజన్ల అభిప్రాయం. ఇంత పేలవ ఫామ్‌లో ఉన్న డీకే యువ క్రికెటర్లకు ఏ విధమైన సలహాలు ఇచ్చేందుకు వెళ్లాడని నెటిజన్లు గగ్గోలు పెడుతున్నారు.

5 / 6
‘యువ ఆటగాళ్లకు ఇచ్చిన సలహాలను మీ కెరీర్‌లో ఉపయోగించుకోండి’ అని కొందరు అంటుంటే, మరికొందరు ‘పేలవమైన ఫామ్‌లో ఉన్నా అవకాశం ఎలా పొందాలో సలహా ఇచ్చి ఉంటాడు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు.  ఇంకా ఓ నెటిజన్ అయితే‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 391 మ్యాచ్‌లు ఆడి ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయిన ఆటగాడు మరో యువ క్రికెటర్లకు ఏ విధమైన పాఠాలు నేర్పుతాడు’ అని రాసుకొచ్చారు.

6 / 6
అండర్-16 ఆటగాళ్లతో ఇంటరాక్ట్ అయిన దినేష్ కార్తీక్ ఇప్పుడు ట్రోల్స్‌కు ఫోజులిచ్చాడు. అయితే, లక్నో సూపర్‌జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను తన పాత స్వభావాన్ని ప్రదర్శించి ట్రోల్స్‌కు బ్యాట్‌తో సమాధానం ఇస్తాడో లేదో వేచి చూడాలి.