10880, 124, 18లతో లేడీ కోహ్లీ విధ్వంసం.. మిథాలీ ఆల్ టైం రికార్డ్ బ్రేక్.. హిస్టరీలోనే సరికొత్త క్రికెట్ క్వీన్‌గా..

Updated on: Sep 04, 2026 | 7:24 AM

Smriti Mandhana World Record: మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో లేడీ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు సాధించింది. మిథాలీ రాజ్‌ను అధిగమించి 10,880 పరుగులతో అత్యధిక పరుగులతో తోపు ప్లేయర్‌గా నిలిచింది. హాంకాంగ్‌పై 124 పరుగులతో ఆసియా కప్‌లోనూ కొత్త రికార్డు నమోదు చేసింది.

1 / 5
Smriti Mandhana Records: టీమిండియా స్టార్ ఓపెనర్ లేడీ కోహ్లీగా పేరుగాంచిన స్మృతి మంధాన మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీమిండియా మాజీ దిగ్గజం మిథాలీ రాజ్ పేరిట ఉన్న అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డును అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. దుబాయ్‌లో హాంకాంగ్‌తో జరిగిన మహిళల ఆసియా కప్ మ్యాచ్‌లో మంధాన ఈ ఘనత సాధించింది. 18వ ఓవర్‌లో రుచిత వెంకటేశ్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టడంతో మిథాలీ రికార్డును బ్రేక్ చేసింది. అంతకుముందే తన కెరీర్‌లో రెండో టీ20 అంతర్జాతీయ శతకాన్ని పూర్తి చేసిన మంధాన 124 పరుగులతో దుమ్మరేపింది. 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగులు చేసిన మంధాన.. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది.

2 / 5
మిథాలీ రికార్డును అధిగమించి..: మంధాన 10,880 అంతర్జాతీయ పరుగులతో అగ్రస్థానంలో నిలిచింది. మిథాలీ రాజ్ 10,868 పరుగులతో రెండో స్థానంలో ఉంది. సుజీ బేట్స్ 10,740 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

3 / 5
అత్యధిక సెంచరీల రికార్డ్: ఈ మ్యాచ్‌లో మరో అరుదైన ఘనతను కూడా మంధాన అందుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆమె సెంచరీల సంఖ్య 18కు చేరింది. దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్‌ను అధిగమించి మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక శతకాల రికార్డును కూడా సొంతం చేసుకుంది.

4 / 5
ఆసియా కప్‌లోనూ రికార్డు..: హాంకాంగ్‌పై 124 పరుగులతో మంధాన మరో రికార్డు నమోదు చేసింది. మహిళల ఆసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలిచింది. అంతకుముందు చమరి అటపట్టు 119* పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండేది.

5 / 5
మంధాన ఇన్నింగ్స్ ఆధారంగా భారత్ 20 ఓవర్లలో 193/5 స్కోరు చేసింది. ఈ విజయంతో ఆసియా కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి గ్రూప్‌-Aలో అగ్రస్థానానికి చేరింది. అలాగే సెమీస్ చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.

Loading...
Unable to load recommendations.
Follow Us